Anandita: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కుష్భూ సుందర్. కుష్భూ 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తర్వాత 1988లో తమిళంలోకి ఎంటర్ అయ్యారు. ఆనతి కాలంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. కుష్భూ అందానికి, అభినయానికి తమిళ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఏకంగా ఆమె కోసం గుడి కట్టించేశారు. సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో 2000 సంవత్సరంలో నటుడు, డైరెక్టర్, నిర్మాత సుందర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు అవంతిక, అనందిత ఉన్నారు. చిన్న కూతురు అనందిత నటన మీద ఉన్న ఆసక్తితో లండన్‌లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేశారు. త్వరంలో హారోయిన్‌గా ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో అనందిత బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అనందిత.. అప్పుడు, ఇప్పుడు ఫొటోలు, వీడియోలు చూస్తున్న నెటిజన్లు షాక్ తింటున్నారు. ఇలా కూడా మారొచ్చా అని అశ్చర్యపోతున్నారు. షాకింగ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొదట్లో అనందిత ఆకారాన్ని చూసి బాడీ షేమింగ్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు నోరెళ్లబెట్టి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా, అనందిత ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో జరిగిన బాడీ షేమింగ్ అనుభవాలను చెప్పుకొచ్చారు ఆమె మాట్లాడుతూ.. ‘‘ పాజిటివ్ విషయాలతో పాటు నెగిటివ్ విషయాలను కూడా నేను చవిచూశాను. నేను లావుగా ఉన్నప్పుడు దారుణమైన బాడీ షేమింగ్ జరిగింది.

నన్ను మా అమ్మను కంపేర్ చేస్తూ ట్రోల్ చేసేవారు. అమ్మ చాలా అందంగా ఉంటుంది. కానీ, నేను అలా కాదు. నేను మా అమ్మలా లేనని అంటూ ట్రోల్ చేసేవారు. 17 ఏళ్ల వయసులో నేను రియలైజ్ అయ్యాను. అందుకే ఎవ్వరికీ కనిపించకుండా ప్రైవేట్ అయ్యాను. బరువు కూడా తగ్గాను. అప్పుడు ఇంకోలా ట్రోలింగ్ మొదలుపెట్టారు. నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అలా అయ్యానని అనటం మొదలుపెట్టారు. ఎవరైనా 16-17 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా?.. వాళ్లు సరిగ్గా ఆలోచిస్తే అది అర్థం అవుతుంది. ట్రోలింగ్ కారణంగా నేను ఎక్కువగా ఇంటికే పరిమితం అయ్యాను’’ అని చెప్పుకొచ్చింది. మరి, నటి కుష్భూ కూతురి షాకింగ్ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.