ఆంటీ ఎనర్జీ వేరే లెవల్..? కుర్రాళ్లు కూడా ఆమెతో సమానంగా డ్యాన్స్ చేయలేకపోయారు.. వీడియో చూస్తే ఆశ్చర్యం మీ వంతే..?

0
20

వివాహ వేడుకలు, హల్దీ ఫంక్షన్ లలో ఆడవారు డ్యాన్స్ చేస్తుంటారు. అప్పట్లో పెద్దగా బయటకు పొక్కకుండా సాగిన ఈ తతంతంగా సోషల్ మీడియా పుణ్యమాని సెల్ ఫోన్ల ద్వారా ఇప్పుడు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి. చాలా వరకు మహిళలు డ్రింగ్‌కు దూరంగా ఉంటారు. కానీ ఇందులో కొంచెం డిఫరెంట్ గా కనిపించింది అంటీ. తాగకున్నా తాగినట్లు నటిస్తూ ఎనర్జటిక్ గా డ్యాన్స్ ఫ్లోర్ పై రెచ్చిపోయింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో ఆంటీ ఎనర్జీని బయట పెట్టింది. డ్యాన్స్ ఫ్లోర్ పై ఆమె నృత్య విన్యాసంతో నెట్టింట అందరినీ తన వైపునకు ఒక్కసారి చూసేలా చేసింది. ఒక పెండ్లి వేడుకలో పాల్గొన్న ఆమె పూర్తిగా డ్యాన్స్ పై మనసు లగ్నం చేయాలనుకుంది.

‘1985లో వచ్చిన కాలా సూరజ్ మూవీలోని సాంగ్ కు డ్యాన్స్ చేసింది. ఉదారంగు చీరతో అప్పటికే తాగినట్లు కనిపించిన సదరు మహిళ సాంగ్ ఎంట్రీలో మందు బాటిళ్లతో స్టేజ్ పైకి వస్తుంది. కింద ఉన్న మరో మహిళను స్టేజ్ పైకి లాగాలని చూసినా ఆమె రాకపోవడంతో సోలోగానే డ్యాన్స్ చేస్తుంది. కొన్ని నిమిషాల పాటు అందరినీ కన్నార్పకుండా చేసేన ఆ ఆంటీతో కలిసి డ్యాన్స్ చేసేందుకు కుర్రకారు స్టేజీ పైకి వెళ్తారు. వారితో కలిసి అంతే ఎనర్జటిక్ గా ఆంటీ డ్యాన్స్ చేసింది. యువకులు అలసిపోయినా ఆమె మాత్రం అలసటలేకుండా డ్యాన్స్ పై మనసు లగ్నం చేసి ఆడుతూనే ఉంది.

పెద్ద వారు స్టేజ్ ఆక్రమిస్తే వారితో కలిసి పిల్లలు డ్యాన్స్ చేయడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. పిల్లల కాళ్లు తొక్కడ, వారికి చేతులు తగలడం లాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఒక పిల్లవాడు ఆంటీతో కలిసి డ్యాన్స్ చేస్తానని స్టేజ్ పైకి ఎక్కాడు. వెనుకవైపు ఉన్న పిల్లవాడిని గమనించని ఆమె అతనిపై పడుతుంది. తిరిగి లేచి మళ్లీ డ్యాన్స్ చేయడం ఆంటీ ఎనర్జీ వేరే లెవల్ అని కుర్రకారు కూడా అనుకుంటుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here