Chiranjeevi: అల్లు అరవింద్ తో విభేదాలు.. బాలయ్యతో టాక్ షో.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!

0
15

Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన చిరంజీవి ఎన్నో విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అలాగే అల్లు అర్జున్ కుటుంబానికి ఇటీవల కొంత విభేదాలు ఉన్నాయన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా మెగా ట్యాగ్ ఏమాత్రం ఇష్టపడడం లేదని.. అందుకే ఇంకా హీరోలకు దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ తో ఉన్న గొడవలు అలాగే బాలకృష్ణతో అల్లు అరవింద్ ఎందుకు క్లోజ్ గా ఉంటున్నారు అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు అందరితో స్నేహపూర్వకంగా ఉండడానికి ఇష్టపడతారు వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే అల్లు అరవింద్ తో మాత్రం వారికి కొంత గ్యాప్ ఉందని కొన్ని విభేదాలు తలెత్తినట్లు కూడా చాలా వార్తలు వినిపించాయి. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి తరహా వార్తలు మాకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా మా మధ్యలో అలాంటి విభేదాలు రాలేదు.

కుటుంబ పరంగా అయితే ఎప్పుడు మేము కలిసే ఉన్నాము. అల్లు అరవింద్ (Allu aravind)పుట్టినరోజు సందర్భంగా మేము ఎప్పటికీ వారి ఇంటికి వెళ్లి వస్తూ ఉంటామని చిరంజీవి తెలిపారు. అంతేకాదు కుటుంబ పరంగా ఎప్పుడు కలిసి ఉండే మేము.. రీసెంట్గా క్రిస్మస్ సందర్భంగా జరిగిన వేడుకల్లో నేను పాల్గొనక పోయినప్పటికీ మా కుటుంబంలోని అందరూ కూడా ఒక దగ్గర చేరి సెలబ్రేట్ చేసుకున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా మా ఇంటికి వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు అని తెలిపారు.

ఇకపోతే బాలయ్యతో అల్లు అరవింద్ అన్ స్టాపబుల్ షో చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన తెలిపారు. నేను బిజీగా ఉండడం వల్లే ఆ ఆఫర్ నాకు రాకపోయి ఉండవచ్చు. అయినా అన్ స్టాపబుల్ షో బాగా ముందుకు వెళ్తోంది.. ఇండస్ట్రీలో ఆహా అనేది అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అప్పుడే సక్సెస్ అవుతుంది . మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము.. అంటూ బాలయ్య (Balakrishna) తో అల్లు అరవింద్ షో చేయడంపై కూడా క్లారిటీ ఇచ్చారు చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here