ఈ చిన్ననాటి ఫొటోలో క్యూట్ గా ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా…

0
21

పూరీజగన్నాద్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన సినిమా దేశముదురు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది హన్సిక.మొదటి సినిమాతోనే తన అందంతో,నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో హన్సిక సక్సెస్ అయ్యింది అని చెప్పచ్చు.మొదట ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.హన్సిక షకలక భూమ్ భూమ్ అనే సీరియల్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత ఆమె దేశ్ మీ నిక్లా హోగా చాంద్ అనే సీరియల్ లో కూడా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఇక హిందీ లో ఈమె హృతిక్ రోషన్ హీరోగా చేసిన కోయి మిల్ గయా అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.తెలుగులో ఈమె దేశముదురు సినిమా తర్వాత కంత్రి,మస్కా వంటి పలు సినిమాలలో నటించింది.తెలుగుతో పాటు ఈమె హిందీ,తమిళ్ మరియు మలయాళంలో కూడా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపును ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

అయితే ఇటీవలే కాలంలో సోషల్ మీడియాలో సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్న ట్రెండ్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రస్తుతం హన్సిక చిన్ననాటి ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే హన్సిక చిన్ననాటి ఫోటో చూస్తే అభిమానులు ఆమెను క్షణాల్లో గుర్తుపట్టగలరు అని చెప్పచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here