అస్సలు గుర్తుపట్టనంతగా మారిపోయిన హీరోయిన్ రంభ…ఇప్పుడు ఏం చేస్తుందో…ఎక్కడ ఉందో తెలుసా…

0
23

టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండే ఉంటారు.పలు హిట్ సినిమాలలో నటించి తమ అందంతో అభినయంతో ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ రంభ కూడా ఒకరు అని చెప్పచ్చు.ఒకప్పటి స్టార్ హీరోయిన్లు రోజా,ఇంద్రజ బుల్లితెర మీద సందడి చేస్తూ బిజీ గా ఉన్నారు.మరికొంత మంది హీరోయిన్లు సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.ఇంకొంత మంది పెళ్లి చేసుకొని తమ సమయాన్ని తమ ఫ్యామిలీ తో బిజీ గా గడుపుతున్నారు.

అలా పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన హీరోయిన్లలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రంభ కూడా ఒకరు.తన అందంతో అందరిని ఫిదా చేసి మంచి గుర్తింపుతెచ్చుకున్న హీరోయిన్ రంభ.మొదటి సినిమాతోనే తన అందంతో,నటనతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది రంభ.అప్పట్లో చిరంజీవి,నాగార్జున,వెంకటేష్,జగపతి బాబు ఇలా పలువురు అగ్ర హీరోలకు జోడిగా నటించి మెప్పించింది.

తెలుగుతో పాటు తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో కూడా రంభ నటించడం జరిగింది.తమిళ స్టార్ హీరోలు అందరికి జోడిగా రంభ నటించింది.2008 సంవత్సరంలో రిలీజ్ అయినా దొంగ సచ్చినోళ్ళు అనే సినిమాలో రంభ చివరగా నటించడం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్ళు రంభ బుల్లితెర మీద జడ్జి గా వ్యవహరించింది.

కెనడా కు చెందిన వ్యాపారవేత్త అయినా ఇంద్ర కుమార్ ను 2010 వివాహం చేసుకుంది రంభ.ఈ దంపతులకు ఒక కుమారుడు,ఇద్దరు కూతుర్లు ఉన్నారు.అయితే సినిమాలకు రంభ దూరమైనా కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంటారు.తన ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటారు రంభ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here