హీరో రవితేజ కు జోడిగా ఇడియట్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైనా హీరోయిన్ రక్షిత.పూరీజగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రవి తేజ తో పాటు హీరోయిన్ రక్షిత కు కూడా మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది.ఇడియట్ సినిమా తో కన్నడ బ్యూటీ రక్షిత తన అందం తో అభినయం తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.హీరోయిన్ రక్షిత అసలు పేరు శ్వేతా.ఆమె సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత రక్షితగా పేరు మార్చుకున్నారు.

ఇడియట్ సినిమా తర్వాత ఆమె మహేష్ బాబు తో నిజం సినిమాలో కూడా నటించారు.అలాగే శివమణి,అందరివాడు,ఆంధ్రావాలా,జగపతి వంటి పలు సినిమాలలో నటించి మంచి స్టార్ డం ను సంపాదించుకున్నారు.సినిమా అవకాశాలతో కెరీర్ మంచి రేంజ్ లో దూసుకుపోతున్న సమయంలో 2007 లో కన్నడ దర్శకుడు అయినా ప్రేమ్ ను వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత రక్షిత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కూడా కన్నడ టీవీ షోలలో జడ్జి గా పలు షోలు చేసారు.

రక్షిత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు.ఇప్పుడు రక్షితను చూస్తే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.హీరోయిన్ గా ఉన్నప్పుడు మంచి స్ట్రక్చర్ మైంటైన్ చేసిన రక్షిత ఇప్పుడు బరువు పెరిగారు.తనకు కొడుకు పుట్టిన తర్వాత థైరోయిడ్ వలన బరువు పెరిగానని రక్షిత ఒక సందర్భంలో తెలిపారు.రక్షిత 2012 లో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టడం జరిగింది.

4.
