బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాలతో పోటీగా శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ కార్యక్రమంలో కూడా ఎప్పటిలాగే జబర్దస్త్ కమెడియన్స్ తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.అదేవిధంగా పలువురు సెలబ్రిటీలు తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్లో భాగంగా ముఖచిత్రం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఈ కార్యక్రమంలో సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముఖచిత్రం హీరోయిన్ తో హైపర్ ఆదితో పులిహోర కలపడానికి ప్రయత్నాలు చేశాడు.ఈ క్రమంలోనే ఆమె తనని అన్నయ్య అని పిలుస్తూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఇంద్రజ తనదైన శైలిలో మాస్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేశారు.
ఇంద్రజ మొదట్లో ప్రియమైన నీకు సినిమాలో మనసున ఉన్నది అనే పాటకు పర్ఫామెన్స్ చేశారు.అనంతరం గజిని సినిమాలో రహతుల రహతుల అనే పాటకు మా స్టెప్పులు వేస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారని చెప్పాలి.ఇలా ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.