జైచిరంజీవ సినిమాలో ఉన్న చిన్నారి ఇప్పుడు యెంత అందంగా ఉందో..ఏం చేస్తుందో తెలుసా…

0
16

Child Artist: కొందరు సినిమాల్లోకి చిన్నప్పుడే వస్తుంటారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రి ఇచ్చి ఆ తరువాత స్టార్ గా ఎదిగిపోతారు. చిన్నప్పుడే సినిమాల్లోని మెళకువలు నేర్చుకున్నవారికి అవకాశాలు కూడా తన్నుకుంటూ వస్తాయి. ఎందుకంటే నటన గురించి వారికి పెద్దగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం డైరెక్టర్లకు ఏర్పడదు. అయితే చైల్డ్ ఆర్టిస్టుగానే ఫేమస్ అయినవాళలు ఎందరో ఉన్నారు. మనసంతానువ్వే, అరుంధతి లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వాళ్లు చాలా మంది గుర్తుపెట్టుకొనే ఉంటారు. అయితే వారు పెరిగి పెద్దవారై సినిమా హీరోయిన్లుగా ఎదిగారు. వారు నటించిన సినిమాల సంగతి పక్కనబెడితే నటనలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అలాంటి హీరోయిన్లు ఎవరో చూద్దామా..

‘మనసంతా నువ్వే’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్తుగా నటించిన సుహానీ కలిత మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించింది కొద్దిసేపే అయినా ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సుహాని 1991 డిసెంబర్లో జన్మించింది. అమె తల్లిదండ్రుల స్వస్థలం ముంబయి ఆయినా ఆమె పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే. అంతేకాకుండా ఆమె చదువంతా ఇక్కడే కొనసాగించింది. గుణశేఖర్ తీసిన బాల రామయణంలో సుహాని బాల నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగు, హిందీ, మలయాళం, బెంగాలీచిత్రాల్లో బాలనటిగా కనిపించింది. ఇక 2008లో ‘సవాల్’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత సుహానీ మళ్లీ వెండితెరపై కనిపించలేదు.

‘జై చిరంజీవ’ చిన్నమ్మాయిలా.. ‘దూకుడు’ సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించిన శ్రీయా శర్మ చెల్డ్ ఆర్టిస్టుగా తెలుగు, మలయాళం, కన్నడం సినిమాల్లో నటించింది. ఆ తరువాత శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వచ్చిన ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ గ్రామంలో జన్మించిన శ్రియా శర్మ ప్రస్తుతం సినిమాల ఆపేసీ పై చదువుల్లో బిజీ అయింది. అయితే చదవు పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి వస్తుందని ఇండస్ట్రీ టాక్.

‘సందడే సందడి’, ‘ఆర్య’ వంటి సినిమాలో బాల నటిగా కనిపించిన శ్రావ్య ‘లవ్ యూ బంగారం’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈమె హైదరాబాద్ కు చెందిన అమ్మాయే. ఇక్కడే బీటెక్ పూర్తి చేసిన తరువాత హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత ‘కాయ్ రాజా కాయ్’, నందిని నర్సింగ్ హోం వంటి చిత్రాల్లో నటించింది. ఆ తరువాత తమిళం, మలయాల సినిమాల్లోనే శ్రావ్య అవకాశాలు పొందింది.

‘అరుంధతి’ సినిమాను ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోరు. ఇందులో అనుష్క పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. అంతేస్థాయిలో అనుష్క చిన్ననాటి పాత్రలో నటించిన దివ్య నగేశ్ కూడా ఏమాత్రం తగ్గకుండా నటించింది. ఇక చాలా రోజుల తరువాత ఈ భామ ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో అవకాశం రాకపోవడంతో కోలివుడ్ వెళ్లి సినిమాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here