ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల (SHEKHAR KAMMULA)స్టైల్ వేరేగా ఉంటుంది. ఆయన తీసిన ప్రతి సినిమా చాలా సింపుల్ కథతో జనాలకు చాలా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా కథలను ఎంచుకునే విధానం ఎలా ఉంటుందయ్యా అంటే మన చుట్టుపక్కల సమాజంలో ఏం జరుగుతుందో అలాగే ఆయన కథలు కూడా ఎంచుకుంటారు. అయితే సెన్సేషనల్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

దీనికి ప్రధాన కారణం ఆయన కథలు రోజువారి మానవ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాల్లో హీరో హీరోయిన్ ఇతర క్యారెక్టర్లు కూడా ఈ సమాజంలో సాధారణ మనుషుల లాగే ఉండే విధంగా చూసుకుంటారు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ముందుగా సరికెక్కించిన మూవీ ఆనంద్.. ఇక అప్పటినుంచి ఎన్నో సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా సాగుతున్నారు. ఈ తరుణంలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(LIFE IS BEAUTYFUL) సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది.

ఈ సినిమా లోని క్యారెక్టర్లు సాధారణంగా మన గల్లీలలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగానే తెరకెక్కించారు. అందమైన ప్రేమ కథలను చాలా డిఫరెంట్ గా చూపించారు శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమాలో జంటగా నటించిన అభిజిత్(ABHIJITH) షగున్ కౌర్, సుధాకర్ జార సాశ్ నటీనటులు మనందరికి చూడగానే నచ్చేశారు.అయితే ఈ చిత్రం తర్వాత వీరు ఒకటి రెండు సినిమాల్లో నటించారు. కానీ ఈ హీరోయిన్లు మాత్రం తెరమరుగైపోయారు. అలాంటి ఈ ముద్దుగుమ్మలలో షగున్ కౌర్ ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో పద్మావతి పాత్రలో నటించిన ఈ అమ్మడు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. పక్కింటి అమ్మాయిలా ఆమె చేసిన పాత్ర వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం షగున్ కౌర్ (SHAGUN KOUR))వివాహం చేసుకున్న తర్వాత సినీ రంగానికి దూరమైంది. అయితే ఈమె లా చదివింది. వివాహం తర్వాత లాయర్ గా సెటిల్ అయిందని తెలుస్తోంది. ఈమెకు సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఎక్కడా దొరకడం లేదు.. దీంతో ఈమె ఎక్కడుంది? ఎలా ఉంది? అని చాలా మంది ప్రేక్షకులు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ హీరోయిన్ ఒక్క సినిమాతోనే కుర్రాళ్ళ మనసులను పిండేసింది అని చెప్పవచ్చు.