Nithya Menen: టీచ‌ర్ గా మారిన నిత్య మీన‌న్‌.. తెలుగు పాఠాలు చెబుతున్న మ‌ల‌యాళ భామ‌!

0
17

నిత్య మీనన్(Nithya Menen).. సౌత్ సినీ ప్రియులకు ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్ట్‌ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. `అలా మొదలైంది` సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే యూత్ ను విపరీతంగా కట్టిపడేసిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మ‌ల‌యాళ‌ భాషల్లో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది.

కానీ ఎక్కడ గ్లామర్ షోకు అవకాశాన్ని ఇవ్వలేదు. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువైంది. తన సహజ నటనతో ఎందరో ప్రేక్షకుల్లో తన అభిమానులుగా మార్చుకుంది. అలాగే సింగర్ కూడా పలు సినిమాల్లో నిత్య మీనన్ పాటలు కూడా పాడింది. అయితే తాజాగా నిత్య మీనన్ పంతుల‌మ్మగా మారిపోయింది. ఓ గవర్నమెంట్ పాఠశాలలో(government school) ఈ మలయాళ భామ తెలుగు పాటలు చెబుతూ దర్శనమిచ్చింది.

ఓ మ‌ల‌యాళ మూవీ షూటింగ్‌లో భాగంగా నిత్యా మీనన్ ఏపీలోని కృష్ణాపురం(Krishnapuram) గ్రామానికి వెళ్లింది. షూటింగ్ పూర్తి కాగానే, దగ్గరున్న ఓ గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లింది. అక్కడి పిల్ల‌ల‌తో కాసేపు సరదాగా గడిపింది. ఆ తర్వాత పిల్లలందరినీ కూర్చు బెట్టుకుని ఓ ఇంగ్లీష్ పాఠాన్ని తెలుగులో అర్థం అయ్యేలా వివరించింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె త‌న ఇన్‌స్టా అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

ఇది నా నూతన సంవత్సర రోజు. కృష్ణాపురం గ్రామంలోని చిన్నారులతో నా కొత్త సంవత్సరం ఎంతో సంతోషంగా గ‌డిచింది. గ్రామాల్లో ఉండే చిన్నారులు బాల్యాన్ని చాలా ఆనందంగా గడుపుతారు. వాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేనూ ఆనందంగా ఉన్నాను` అంటూ నిత్య మీన‌న్(Nithya Menen) త‌న పోస్ట్‌కు రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ వీడియో చూసి నెటిజ‌న్లు, అభిమానులు తెగ మురిసిపోతున్నారు. స్టార్ హీరోయిన్ అనే అహం లేకుండా నిత్య ఒక సాధార‌ణ యువ‌తిలా గ‌డ‌ప‌టం అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here