ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా….

0
23

ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.అప్పట్లో టాప్ హీరోలు అందరికి జోడిగా నటించి ఒక వెలుగు వెలిగారు సిమ్రాన్.ఒక్కప్పుడు వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సిమ్రాన్ ఇప్పుడు పూర్తిగా సినిమాలలో కనిపించడం లేదు.సిమ్రాన్ వ్యక్తిగత జీవితం గురించి చాల మందికి తెలియదు.ముందుగా సిమ్రాన్ బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన మంచి గుర్తింపు రాలేదు.ఆ తర్వాత కన్నడ,మలయాళంలోనూ ఆమె నటించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రియా ఓ ప్రియా అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు సిమ్రాన్.ఆ తర్వాత టాలీవుడ్ టాప్ హీరోలు అయినా చిరంజీవి,బాలకృష్ణ,వెంకటేష్,నాగార్జున,మహేష్ బాబు ఇలా దాదాపు అందరు హీరోలకు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.తెలుగుతో పాటు హిందీ,కన్నడ,తమిళం,మలయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా మారిపోయారు.తాజాగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసారు.

ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో సిమ్రాన్ 46 ఏళ్ళ వయస్సులో కూడా 26 ఏళ్ళ అమ్మాయిగా ఎంతో అందంగా కనిపిస్తున్నారు.సిమ్రాన్ అలా కనిపించడం వెనుక సీక్రెట్ ఏంటి అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.ఇది ఇలా ఉంటె సిమ్రాన్ చివరగా హీరో రజని కాంత్ కు జోడిగా పెటా చిత్రంలో నటించారు.తాజాగా సిమ్రాన్ నటించిన మాధవన్ రాకెట్రి ఫిలిం త్వరలోనే విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here