బోనాల జాతరలో యువతి మాస్ స్టెప్పులు.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!

0
26

మగువలు పురుషులకు సమానంగా రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో వారికంటూ ముద్ర వేసుకుంటున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని ఫేమస్ అవడమే కాకుండా వారి వీడియోలకు ఫాలోవర్స్ కూడా అంతకంతకూ పెరుగుతున్నారు. ఒకప్పుడు బయటకు వచ్చేందుకే ఎన్నో ఆంక్షలు ఉండేవి అమ్మాయిలకు. కానీ రోజులు మారాయి. ఒక విధంగా చెప్పాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది.

ఒకప్పుడు మ్యారేజ్ ఎంజాయ్ మెంట్లలో అబ్బాయిలు తీన్ మార్ స్టెప్పులు వేసేవారు. ఇప్పుడు అమ్మాయిలు వారిని పక్కను నెట్టి ముందుకు వస్తున్నారు. మ్యారేజెస్ లోనే కాకుండా హల్దీ, బారత్, రిషెప్షన్ స్టేజీ ఏదైనా వారి ఆనందాన్ని అడ్డుకట్టేసే వారు లేరు అనడంలో సందేహం లేదు. సమాజంలో వ్యత్యాసాల దృష్టా గతంలో తల్లిదండ్రులు అమ్మాయిలను కట్టడి చేసేవారు. ఇప్పుడు రోజులు మారాయి. తల్లిదండ్రులు కూడా స్వేచ్ఛ ఇస్తున్నారు. తన తల్లి(కూతురు) డ్యాన్స్ ను అందరూ పొగుడుతుంటే తబ్బిబ్బవుతున్నారు.

ఇప్పటి తరం హీరోయిన్లు వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్‌ట్రా గ్రామ్, ట్విటర్ తదితర మాద్యమాలలో డ్యాన్స్ చేస్తూ దూకుడు పెంచుతున్నారు. ఫాస్ట్ బీట్, స్లో ఫర్ఫార్మెన్స్ ఏదైనా మేమూ నటీమణులకు తక్కువ కాదని నిరూపిస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. వీటితో వీరికి అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. చాలా మంది యూట్యూబ్, ఇన్స్‌ట్రా, తదితర సోషల్ మీడియాలో వీడియోలతో దర్శక, నిర్మాతలను ఆకట్టుకుంటూ వెండితెరపై సైతం వెలుగు వెలుగుతున్నారు. చిన్నపాటి ఫంక్షన్ అయినా వీరికి ప్రత్యేక వేధిక, డీజే ఏర్పాటు చేసి మరీ సందడిగా గడపమంటున్నారు పెద్దలు.

ఇటీవల ఒక యువతి జాతరలో వేసిన మాస్ స్టెప్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాధారణంగా బోనాలు జాతరలో శివసత్తులు బోనం ఎత్తుకొని అనుగుణంగా స్టెప్పులు వేస్తుంటారు. వారి ముందు పోతురాజులు ఉండనే ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువతి బోనం ఎత్తుకున్న మహిళతో పాటు, పోతురాజులు, యువకులతో డ్యాన్స్ చేసింది. ఆమె వేసిన మాస్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. పట్టు పరికిణీలో ఆకట్టుకునేలా ఉన్న యువతి తీన్ మార్ స్టెప్పులు వేస్తుంటే ముగ్ధులైన స్థానికులు సెల్ ఫోన్లు చేత పట్టుకొని వీడియో తీసి ఇంకేముంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యువతులే కాకుండా పెద్దలు సైతం చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here