Veera Simha Reddy Review: బాలకృష్ణ నట విశ్వరూపం వీరసింహారెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

0
18

Veera Simha Reddy Review:

నటీనటులు : బాలకృష్ణ, శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ తదితరులు

సినిమాటగ్రఫి: రిషి పంజాబీ

మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్

మాటలు : సాయి మాధవ్ బర్రా

ఎడిటర్ : నవీన్ నూలి

నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి

దర్శకుడు : గోపీచంద్ మలినేని

విడుదల తేదీ: 12 జనవరి 2023

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతిహాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ మసాలా చిత్రం హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరిచాయి. ఈ నేపద్యంలో అఖండ లాంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ బాలకృష్ణ సినిమా ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అంటే ఈ సమస్య లోకి వెళ్లాల్సిందే.

కథ :

జై, అతడి తల్లి మరియు సంధ్య లు టర్కీ లో నివసిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో జై తండ్రిని కలవాలని సంధ్య తండ్రి పట్టుబడతాడు. దాంతో జై తండ్రి వీర సింహారెడ్డి టర్కీలో ల్యాండ్ అవుతాడు. అప్పుడే జై తన తండ్రి వీర సింహారెడ్డిని మొదటి సారి చూస్తాడు. వీర సింహారెడ్డి టర్కీ లో ల్యాండ్ అయ్యింది మొదలు అతడి యొక్క ఫ్ల్యాష్‌ బ్యాక్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంతకు వీర సింహారెడ్డి గతం ఏంటీ? ఫ్యామిలీకి దూరంగా వీర సింహారెడ్డి ఎందుకు ఉండాల్సి వచ్చింది సినిమాను చూసి తెలుసుకోండి.

నటీనటులు:

మాస్ ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరించే బాలకృష్ణ ఈ సినిమాలో మరోసారి ప్రేక్షకులను తన మాస్ నటన తో ఆకట్టుకున్నాడు. బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమా లకు పెట్టింది పేరుగా మొదటినుంచి అలాంటి సినిమాలే చేస్తూ వచ్చాడు. అలా ఇప్పుడు ఆయన చాలా రోజుల తర్వాత పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేశారు ఈ సినిమా. సినిమా లో ఆమె మ్యాన్ షో కనిపించింది. రెండు పాత్ర లో అద్వితీయంగా నటించారు. ఎమోషన్ సన్నివేశాల్లో మరోసారి అదరగొట్టారు. యాక్షన్ సన్నివేశాల్లో అయితే చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా శృతి హాసన్ సరిగ్గా సరిపోయింది. ఆమె పాత్ర కు ప్రాధాన్యం ఉండడం ఆమెకు కలిసొచ్చే అంశం. వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి విలన్ గా ఆకట్టుకుంది. కన్నడ హీరో దునియా విజయ్ బాలయ్య ధీటుగా నటించాడు. విలనిజాన్ని పండించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యారు. మిగితావారు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా రాణించారు.

సాంకేతిక నిపుణులు:

క్రాక్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని గోపీచంద్ అభిమానులు ఎదురు చూడగా ఒక సరైన కథనే ఎంచుకున్నాడని వీర సింహా రెడ్డి సినిమా చూస్తే తెలుస్తుంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కథ, కథ తగ్గ స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని బాగా డిజైన్ చేశాడు దర్శకుడు. మాస్ దర్శకుడు కావడం, బాలయ్య మాస్ పల్స్ ను పట్టి, అభిమానులు కోరుకున్న అంశాలను సినిమా లో ఇమిదించడం లో సక్సెస్ అయ్యాడు. ఎక్కడా బోర్ కొట్టించాడు సీన్స్ డిజైన్ చేశాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్స్ వేరే లెవెల్ లోకి ఉన్నాయి. ఇక ఈ సినిమాకి మరో ఆయువు పట్టు తమన్ సంగీతం. పాటలు పర్వలేదనిపించుకున్నా నేపథ్య సంగీతం మాత్రం ఎప్పటిలాగే అదరగొట్టాడు. థియేటర్స్ లో కొన్ని కొన్ని సీన్స్ కి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటే తమన్ సంగీతమే కారణం. రిషి పంజాబీ కెమెరా పనితనం స్క్రీన్ పైన స్పష్టంగా కనిపించింది. ఎడిటింగ్ బాగుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ఎంతో రిచ్ గా క్వాలిటీ గా కనిపించింది.

ప్లస్ పాయింట్స్ :

యాక్షన్ సీన్స్

బాలకృష్ణ

సంగీతం

దర్శకత్వం

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

హెవీ రన్ టైమ్

తీర్పు : ఫైనల్ గా వీర సింహా రెడ్డి ప్రతి ఒక్కరూ చూడదగ్గ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్. బాలయ్య అభిమానులను ఈ సినిమా ఎంతో అలరిస్తుంది. కథ లో కాస్త లోపాలు కనిపించినా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ సినిమా సూపర్ హిట్ వైపు తీసుకెళుతుంది.

రేటింగ్ : 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here