Waltair Veerayya: `వీర సింహారెడ్డి`కి బిగ్ షాక్‌.. థియేట‌ర్స్ అన్నీ `వాల్తేరు వీర‌య్య‌`కే!

0
17

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీకి దిగిన సంగతి తెలిసిందే. వారిలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మెగాస్టార్ చిరంజీవి మరొకరు. బాలయ్య `వీర సింహారెడ్డి`(Veera Simha Reddy) సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ నిన్న విడుద‌లైంది.

అయితే ఆ అంచనాలను అందుకోవడంలో వీర సింహారెడ్డి విఫలమైంది. కేవలం మాస్ ప్రేక్షకుల‌కు మాత్రమే అన్నట్టుగా ఈ సినిమా ఉంది. అయినా సరే తొలి రోజు ఈ చిత్రం అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక నేడు ఈ సినిమాకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి నుంచి `వాల్తేరు వీరయ్య`(Waltair Veerayya) వచ్చింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో రవితేజ కీలక పాత్రను పోషించాడు. ఇందులోనూ శృతి హాస‌న్ నే హీరోయిన్ గా నటించింది.

మైత్రీ మూవీ మేకర్స్ వారే ఈ సినిమాను సైతం నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయితే వాల్తేరు వీరయ్య రాక‌తో వీర సింహారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సంక్రాంతికి విడుదల అవుతున్న మొట్టమొదటి పెద్ద సినిమా కావ‌డంతో ‘వాల్తేరు వీరయ్య’ కంటే ఎక్కువగా `వీర సింహా రెడ్డి`కే థియేటర్స్ ను కేటాయించారు. అమెరికా నుండి అనకాపల్లి వరకు ఇదే పరిస్థితి. కానీ, బాలకృష్ణ(Balakrishna) సినిమాతో పోలిస్తే నేడు విడుద‌లైన చిరు సినిమా టాక్ కాస్త బెట‌ర్ ఉంది.

దీంతో రెండో రోజు `వీర సింహారెడ్డి` కోసం లాక్ చేసిన థియేట‌ర్లు అన్నీ బ‌య్య‌ర్లు `వాల్తేరు వీర‌య్య‌`కు ఇచ్చేశారు. ఇక సాయంత్రం షోస్ నుండి చిరంజీవి(Chiranjeevi) సినిమాకు ఆడియన్స్ రష్ విపరీతంగా పెర‌గ‌నుంద‌ని అంటున్నారు. అయితే తొలి రోజు అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను రాబ‌ట్టిన వీర సింహారెడ్డికి.. వీర‌య్య రాక‌తో రెండో రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయని టాక్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here