అర్జున్ రెడ్డి హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా మారిందో తెలుసా?

Movie News Trending

అర్జున్‌రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సినీ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్న హీరోయిన్ షాలినీ పాండే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో షాలినీ పాండే తన నటనతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. తొలి సినిమాలోనే విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్‌గా కూడా మెప్పించింది. తొలి చిత్రంలోనే ఈ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత షాలినీ పాండే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ ఊహించారు. అయితే అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్న తరహాలో షాలినీ పాండే కెరీర్ అస్తవ్యస్తంగా తయారైంది. అర్జున్‌రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో షాలినీ పూర్తిగా విఫలమైంది. షాలిని పాండే 1994 సెప్టెంబర్ 23న పుట్టింది. మోడల్‌గా చేస్తూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2016, 2017లో హిందీలో టీవీ షోల్లోనూ ఈ బ్యూటీ నటించింది. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా షాలినీ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత మహానటి, ఎన్​టీఆర్​ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒక్కటే వంటి వివిధ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అయితే హీరోయిన్ వేషాలు మాత్రం వచ్చింది తక్కువనే చెప్పాలి.

వాస్తవానికి షాలినీ పాండే పెద్ద అందగత్తేమీ కాదు. ఎత్తు కూడా తక్కువగా ఉండటంతో ఆమెకు హీరోయిన్ అవకాశాలు తక్కువగా వచ్చాయి. కాస్త బొద్దుగా కూడా ఉంటుంది. అయితే ముఖంలో నవ్వు, కళ బాగుంటాయి. అందుకే ఆమె దర్శకుడు సందీప్ వంగా అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ఎత్తుగా ఉన్నా ఆ సినిమాలో అతడి పక్కన షాలినీ సూటయ్యింది. ఈ సినిమా విడుదలై ఐదేళ్లు దాటుతున్నా ఇంకా అర్జున్‌రెడ్డి హీరోయిన్‌గానే షాలినీని పిలుస్తున్నారు. ఈ మూవీలో ఉత్తమ నటనకు కారణం దర్శకుడేనని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాలినీ వెల్లడించింది. న‌టిగా ఈ చిత్రం మ్యాప్ లాగా ప‌నిచేసిందని అభిప్రాయపడింది. తనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయంటే దానికి కారణం తాను కాదని.. దర్శకుడేనని స్పష్టం చేసింది. అర్జున్ రెడ్డి అందించిన విజయం బహుముఖ కళాకారిణిగా గుర్తింపు పొందాలనే తన అభిరుచికి ఆజ్యం పోసిందని వివరించింది.

అర్జున్‌రెడ్డి సినిమా తర్వాత బాలీవుడ్ అవకాశాలు వచ్చాయని షాలినీ పాండే వెల్లడించింది. ప్రస్తుతం హిందీలో జయేష్​ బాయ్​ జోర్దార్​, మహారాజ వంటి సినిమాల్లో ఆమె నటిస్తోంది. కరోనాకు ముందు వరకు అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డ షాలినీ కెరీర్ ఇప్పుడు ఒక్కసారిగా వేగంతో దూసుకుపోతోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫోటోషూట్‌లకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో షాలినీకి సోషల్ మీడియాలో ఫాలోవర్లు బాగానే ఉన్నారు. ఫోటో షూట్లతో అర్ధంతరంగా ఆగిపోయిన కెరీర్‌ను మళ్లీ పట్టాలెక్కించే పనిలో పడింది. ఈ మధ్య కాలంలో షాలినీ పాండేపై అనేక రూమర్స్ వచ్చాయి. దీంతో ఆమె మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యింది. అందుకే కెరీర్ పతనావస్థకు చేరిందని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *