అల్లరి నరేష్ ని దారుణంగా మోసం చేసిన ప్రముఖ టాలీవుడ్ టాప్ హీరోయిన్

Movie News Trending

అల్లరి నరేష్ ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ దర్శకుడు ఇవీవీ సత్యనారాయణ రెండో కుమారుడిగా తెరంగేట్రం చేసి తొలి సినిమా అల్లరితోనే సందడి చేశాడు. దీంతో అతడికి అల్లరి నరేష్ అని ఆడియన్స్ నామకరణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అతడు ఎన్ని సినిమాల్లో నటించినా అల్లరి నరేష్‌గానే చలామణి అవుతున్నాడు. కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకానొక సమయంలో వరుస హిట్లతో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. కానీ సుడిగాడు సినిమా తర్వాత నరేష్ సుడి కూడా టర్నింగ్ ఇచ్చుకుంది. ఆ సినిమా తర్వాత విజయం కోసం ముఖం వాచిపోయాడు. ఎన్నో సినిమాల్లో నటించినా హిట్ పలకరించలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. మహేష్‌బాబు మహర్షి సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించాడు. అయితే గత ఏడాది వచ్చిన నాంది సినిమా అల్లరోడి ఖాతాలో మరో హిట్‌గా చేరింది. దీంతో అల్లరి నరేష్ కెరీర్ మరోసారి ఊపందుకుంది.

కరోనా తర్వాత గత ఏడాది విడుదలైన నాంది సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచి సుమారు రూ.10 కోట్ల షేర్ వసూలు చేసి అల్లరి నరేష్‌ను హిట్ ట్రాక్‌లో పడేసింది. అయితే కెరీర్ ప్రారంభం నుంచి అల్లరి నరేష్ ఎక్కువగా కాంట్రవర్సీల జోలికి వెళ్లేవాడు కాదు. తన పనేదో తాను చేసుకుంటూ పోతుంటాడు. అందుకే అల్లరి నరేష్‌తో దర్శకులు చాలా సౌలభ్యంగా పనిచేసేవాళ్లు. అయితే అల్లరి నరేష్ కూడా కెరీర్ ప్రారంభంలో ఒక హీరోయిన్‌తో లవ్ ఎఫైర్ నడిపాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామని ప్రయత్నించారు. కానీ అల్లరి నరేష్ వరుసగా ఫ్లాపుల బారిన పడటంతో సదరు హీరోయిన్ అల్లరోడిని వదిలించుకుందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అయితే అల్లరి నరేష్ మాత్రం ఆమెను సిన్సియర్‌గా ప్రేమించాడట. కానీ ఆమె మాత్రం అతడికి హ్యాండ్ ఇచ్చి తమిళ హీరోను పెళ్లిచేసేసుకుంది. ఇటీవలే ఒక బిడ్డకి కూడా జన్మనిచ్చింది. ఈ వార్త బహిర్గతం అయిన దగ్గర నుంచి నెటిజన్‌లు ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయం తెలుసుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నారు.

అయితే అల్లరి నరేష్‌తో ఆమె రెండు, మూడు సినిమాల్లో నటించిందని.. ఆమె ఎవరో కాదు ఫర్జానా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, సీమ శాస్త్రి వంటి సినిమాల్లో నరేష్ పక్కన చేసింది. అయితే మరికొందరు ఫర్జానా కాదని వాదిస్తున్నారు. ఏదేమైనా సదరు హీరోయిన్ వదిలేసిన తర్వాత అల్లరి నరేష్ మానసికంగా కుంగిపోయాడని.. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడని అతడి సన్నిహితులు చెప్తున్నారు. కొన్నాళ్ల తర్వాత తేరుకుని అల్లరి నరేష్ విరూపా అనే అమ్మాయిని పెళ్లాడాడు. వీళ్లిద్దరికీ ఒక పాప కూడా ఉంది. వివాహం చేసుకున్న తర్వాత నరేష్ తన కెరీర్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టాడు. అలా ఫోకస్ పెట్టినప్పుడే వెంటనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ తగిలింది. ఇప్పుడు నరేష్ ప్రస్తుతం ఉగ్రం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే మేక‌ర్స్‌ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలను వెల్లడించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *