ఆచార్య సినిమా దెబ్బకి తన ఇల్లుని అమ్మేసుకున్న కొరటాల శివ

Movie News

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఈ సినిమా తో తన సక్సెస్ స్ట్రీక్ కి భారీ ఎత్తున్న బ్రేక్ వేసుకోవడమే కాకుండా తన కెరీర్ ని కూడా రిస్క్ లో పెట్టేసాడు..కొరటాల శివ ఈమధ్య డైరెక్షన్ కంటే ఎక్కువగా సినిమా బిజినెస్ వ్యవహారాల్లోనే ఎక్కువగా తల దూరుస్తున్నాడు.

ఇన్ని రోజులు సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి అందులో ఉన్న ఆటుపోట్లని ఎదురుకోలేదు కానీ..ఆచార్య సినిమాకి మాత్రం కమిలిపోయాడనే చెప్పాలి..కథ కథనం మీద ద్రుష్టి ఏ మాత్రం పెట్టకుండా..కేవలం హీరోలను మాత్రమే నమ్ముకొని సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి నిదర్శనమే ఆచార్య చిత్రం..మెగా స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అభిమానులందరూ ఆశిస్తే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ అత్యంత వరస్ట్ చిత్రం గా నిలిచింది ఆచార్య చిత్రం.

విడుదలైన అన్ని ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి భారీ స్థాయిలో బయ్యర్స్ కి నష్టాలు వచ్చాయి..ఈ నష్టాలను పూడ్చాలంటూ కొరటాల శివ మీదకు వచ్చేసారు ఇప్పుడు వాళ్లంతా..అయితే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారికి అమ్మాము అని..వాళ్ళు ఇంకా పూర్తి స్థాయి పేమెంట్ చెయ్యలేదని..వాళ్ళు డబ్బులు ఇవ్వగానే మీకు సెటిల్ చేస్తానని కొరటాల శివ బయ్యర్స్ కి చెప్పాడట..అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపుగా 25 కోట్ల రూపాయలకు కొన్న సంగతి మన అందరికి తెలిసిందే.

అయితే ఈ డబ్బులు కూడా సరిపోకపోవడం తో కొరటాల శివ తన ఆస్తులను కుదవ పెట్టి బయ్యర్స్ కి డబ్బులు పంచుతున్నాడట..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ని ఎన్టీఆర్ ఇప్పుడే ప్రారంభించడానికి ఆసక్తి చూపించడం లేదట..కొరటాల శివ ఫైనాన్సియల్ సమస్యలు మొత్తం క్లియర్ చేసుకొని ప్రశాంతమైన మూడ్ ఉన్నప్పడే ప్రారంభించాలని చూస్తున్నాడు..అందుకే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ పోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *