ఆదిపురుష్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఫాన్స్ కి ఇక పూనకాలే

Movie News Trending

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయో మన అందరికి తెలిసిందే..బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడం తో సాహూ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అదిరిపోయాయి..ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇతర హీరోల హిట్ రేంజ్ లో వసూళ్లు రాబట్టింది..కానీ ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా మాత్రం అతి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కేవలం 80 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసి..నిర్మాతలకు మరియు బయ్యర్లకు 200 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించి ఇండియా లోనే నెంబర్ 1 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది..ఇలా రెండు సినిమాలు అభిమానులను తీవ్రమైన నిరాశ పరచడం తో ప్రభాస్ అభిమానులు ఇప్పుడు అర్జెంటు గా తమ హీరో నుండి బ్లాక్ బస్టర్ హిట్ ని కోరుకుంటున్నారు..ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలన్నీ కూడా మినిమం గ్యారంటీ సినిమాలే అవ్వడం విశేషం.

ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో సలార్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రాత్ తో ఆదిపురుష్ మరియు మహానటి సినిమా దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ K వంటి సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు..వీటిల్లో సలార్ మరియు ఆదిపురుష్ సినిమాలపై అభిమానుల్లోనూ మరియు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి..ఆదిపురుష్ సినిమాని మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి..ప్రస్తుతం మోషన్ కాప్చర్ టెక్నాలజీ కి సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ పై వర్క్ చేస్తుంది మూవీ టీం..రామాయణం ని అత్యాధునిక టెక్నాలజీ తో తెరెకెక్కిస్తున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా , సీతగా క్రితి సనన్ మరియు రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు..ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా కి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

అదేమిటి అంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నాడట..ఇటీవలే ముంబై లో రామ్ చరణ్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసినట్టు తెలుస్తుంది..ప్రభాస్ మరియు రామ్ చరణ్ కి మధ్య ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉండడం వల్ల..ఆ చనువుతో ప్రభాస్ అడగగానే మరో మారు ఆలోచించకుండా రామ్ చరణ్ ఆ అతిధి పాత్ర చెయ్యడానికి ఒప్పేసుకున్నాడట..రామ్ చరణ్ మరియు ప్రభాస్ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలు..ఈ ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ క్రేజ్ ఏ లెవెల్ లో ఉంటుందో ఊహించడం కూడా మనతరం కాదు..ఎందుకంటే ఇద్దరికీ యూత్ మరియు మాస్ లో ఉన్న క్రేజ్ అలాంటిది మరి..వీళ్లిద్దరి కాంబినేషన్ పూర్తి స్థాయి సినిమా కాకపోయినా..కనీసం అతిధి పాత్రలోనైనా కాసేపు ఇద్దరినీ ఒకే తెరపై చూడొచ్చు అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *