ఉత్తర భారత దేశంలోనీ, హిమాచల్ ప్రదేశ్ పర్వత రాష్ట్రం, ఇతర భారతీయ రాష్ట్రాల మాదిరిగానే, బహుళ ప్రాంతీయ బహుళ సాంస్కృతిక మరియు బహుభాషా రాష్ట్రం.శక్తివంతమైన హిమాలయాల దిగువన ఉన్న హిమాచల్ చాలా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ సంస్కృతికి చాలా గొప్పది. ఇది స్థానిక ప్రజలు రోజువారి జీవితంలో కనిపిస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ లో మీకు తెలియని కొన్ని వింతైన ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. మొదటిగా హిమాచల్ ప్రదేశ్ లోని కీమోర్ జిల్లాలో చాలా వింతైన ఆచారం ఒకటి ఉంది. ప్రాచీన కాలంలో ద్రౌపటికి ఐదుగురు భర్తలు ఉన్నట్లు, ఈ రాష్ట్రంలో కూడా అలాంటి ఆచారమే ఒకటి ఉంది. ఆచారం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కీమోడ్ జిల్లాలో ఒకే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు అందరూ కలిసి, ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారట

మహాభారతంలో దౌపదిని ఐదుగురు పాండవులు పెళ్లి చేసుకున్నట్లు, హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని తెగలలో ఇదే విధానాన్ని పాటిస్తూ ఉంటారు. మహాభారతం సమయంలో ఇక్కడ ఉన్న కీమోడ్ జిల్లాలో, పాండవులు ద్రౌపది కొంతిదేవితో కలిసి అజ్ఞాతవాసం చేస్తూ ఒక గుడిలో కొంతకాలం తలదాచుకుంటారట, ఆనాడు ఆలా మొదలైన ఆచారం, ఇంకా నేటికీ కొనసాగడాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ పద్ధతిని అక్కడ భాషలో ఓటుర్ ఆచారమని అంటారు. ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారట. ఇక్కడ పెళ్లి సమయంలో పెళ్లి కుమారుడు ధరించే టోపీకి వివాహం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉంటుందని చెబుతారు.
ఎందుకంటే పెళ్లి తర్వాత ఎవరైనా సోదరుడు టోపీ బయట వేలాడుతూ ఉంది అంటే, ఆ గదిలో అతడు భార్యతో ఏకాంతంలో ఉన్నట్లు అర్థం. అలా ఉన్నప్పుడు అటువైపు వెళ్ళకుండా మిగతా నలుగురు అన్నదమ్ములు, తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారట, సోదరులను అత్యంత ప్రేమ అభిమానాలతో చేసే ఈ తెగ వారికి, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఎక్కువ అని చెప్పవచ్చు చెబుతూ ఉంటారు. ఇక్కడ వివాహం పరంపర కూడా భిన్నంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఒక యువతి పెళ్లి నిశ్చయం అవుతుందో అప్పుడు పెళ్లికూతురు తల్లిదండ్రులు, పెళ్ళికొడుకు కుటుంబం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు.
కుటుంబంలో ఉండే స్త్రీ పెద్దను ఓయినిక్ అని అంటారు. అలాగే పురుష పెద్దను గోర్తెక్స్ అని పిలుస్తారు. గొర్తెక్స్ అంటే ఆ ఇంటి యొక్క స్వామి అని అర్థం. ఆ ప్రదేశంలో భోజనం చేసేటప్పుడు, ఆల్కహాల్ తాగడం నిషేధం. అయినా కానీ పురుషులు అప్పుడప్పుడు మద్యం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్త్రీలు అందరూ తమ భర్తలను సమానంగా చూస్తారు, వారితో సమానంగా కలిసిమెలిసి ఉంటారు. కేవలం మనదేశంలోనే కాదు జర్మనీ బ్రిటన్ లాంటి అనేక దేశాలలో ఒక స్త్రీని ఎక్కువమంది పురుషులు వివాహమాడే ఆచారం ఉందని తెలియజేసే ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.