ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్

Movie News Trending

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్ ఎంత భారీ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ రికార్డుల వర్షం కురిపిస్తోంది. జీ5, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ వంటి ఫేమస్ ఓటీటీలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా జక్కన్న టేకింగ్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లోని ఫైర్ ఈ సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టాయి. స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ నటన చూసిన ప్రతి ఒక్కరు అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ సినిమాతో ఇండియాలోనే ది బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ అంటూ ప్రశంసలు కూడా లభించాయి. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ అభినయం ఆస్కార్ బరిలో నిలిచేలా చేస్తోంది. 2023 ఆస్కార్ అవార్డుల నామినేషన్‌లో ఎన్టీఆర్ నిలిచే అవకాశం ఉందని హాలీవుడ్‌లో కథనాలు వచ్చాయి.

ఇటీవల వచ్చిన వార్తలు కనుక నిజమైతే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంపిక అయిన హీరో ఎన్టీఆర్ ఒక్కడే అవుతాడు. అది నిజంగా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమనే చెప్పాలి. బెస్ట్‌ ఇంటర్‌ నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ క్యాటగిరీలో ఎన్టీఆర్ ఆస్కార్‌ పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్యాటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఖచ్చితంగా అవార్డు గెలుచుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్‌ ఆస్కార్ బరిలో నిలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ మూవీలో తన బిడ్డ ఎన్టీఆర్ నటన అద్భుతమని.. తన బిడ్డకు కాకపోతే ఆస్కార్ ఎవరికి వస్తుందని బాలయ్య తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ పట్ల గర్వపడేలా బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య ప్రస్తుతం రాజకీయాలతో పాటు గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా గడుపుతున్నారు. త్వరలో అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్‌కు కూడా ఆయన సిద్ధమవుతున్నారు.

అటు ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టించింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 272.31 కోట్ల షేర్, రూ. 415 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏరియాలో ఏకంగా రెండు థియేటర్లలో రూ.కోటి గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. సుదర్శన్, దేవి థియేటర్లలో ఆర్.ఆర్.ఆర్ మూవీ రూ.కోటి వసూలు చేసి ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఒకే ఏరియాలో రెండు థియేటర్లలో ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి. ఆర్.ఆర్.ఆర్ మూవీలో యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్ని విధాలుగా తారక్ అభిమానులను మెప్పించాడు. తాతకు తగ్గ మనవడిగా.. తండ్రిగా తగ్గ తనయుడిగా.. బాబాయ్‌ పేరు నిలబెట్టే నట వారసుడిగా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా ఈ మూవీలో పెద్ద పులితో తారక్ ఫైట్ చేసే సీన్, ఇంటర్వెల్‌ ముందు బ్రిటీష్ కోటలోకి ఎన్టీఆర్ ఎంట్రీ సీన్‌కు వారంరూ ఫిదా అయిపోయారు. ఇక కొమురం భీముడో.. అంటూ సాగే సాంగ్‌లో తారక్ నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *