ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు నామినేషన్స్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్

Movie News Trending

ఈ ఏడాది విడుదలైన రాజమౌళి #RRR చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ విడుదలైన అన్ని ప్రాంతాలలో కూడా రికార్డుల వర్షం కురిపించింది..ఈ సినిమా తో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు పాన్ ఇండియా ఇమేజి కాదు..పాన్ వరల్డ్ ఇమేజి వచ్చింది..థియేటర్స్ నుండి సుమారు 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం OTT లో విడుదలైన తర్వాత ఇతర దేశాల ఆడియన్స్ కి కూడా ఒక రేంజ్ లో రీచ్ అయ్యింది..నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ సినిమాలు కాకుండా ఒక ఇండియన్ సినిమా 14 వారాల నుండి టాప్ లో ట్రెండ్ అవుతుంది అంటే మాములు విషయం కాదు..సుమారు 50 మిలియన్ యూజర్లు ఈ సినిమాని వీక్షించినట్టు సమాచారం..ఇక సోషల్ మీడియా లో అయితే ఇతర దేశాలకు చెందిన ఆడియన్స్..మరియు హాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం #RRR ని పొగడ్తలతో ముంచి ఎత్తారు.

ముఖ్యంగా హీరోలను అయితే ఆకాశానికి ఎత్తేసారు..రామ్ చరణ్ తో హాలీవుడ్ లో ఐరన్ మాన్ , బాట్ మ్యాన్ వంటి సూపర్ హీరో రోల్స్ లో తీసుకోకపోతే హాలీవుడ్ డైరెక్టర్స్ పెద్ద తప్పిదం చేసినట్టే అంటూ ఏకంగా హాలీవుడ్ దర్శక నిర్మాతలు ట్వీట్స్ వెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం..అంతే కాకుండా కొంతమంది హాలీవుడ్ రైటర్స్ రామ్ చరణ్ జేమ్స్ బాండ్ రోల్స్ కి కూడా బాగా సరిపోతాడు అంటూ కితాబు ఇచ్చారు..ఇలా రామ్ చరణ్ కి ఈ రేంజ్ లో ప్రశంసలు దక్కుతున్నాయి..మరోపక్క ఎన్టీఆర్ ని హాలీవుడ్ కి సంబంధించిన ఒక ప్రఖ్యాత మ్యాగజైన్ ‘వెరైటీ’ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రెడిక్ట్ చేసాడు..గత రెండు వారల నుండి ఇండస్ట్రీ ని ఊపేస్తున్న వార్త ఇది..ఎక్కడ చూసిన దీని గురించే చర్చలు నడుస్తున్నాయి..అంతే కాకుండా ఇటీవలే #RRR సినిమాని చూసి ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మరి డిన్నర్ కి ఆహ్వానించాడు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా..ఇది అయితే ఇండస్ట్రీ తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఇక ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తుందని ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ ప్రచురించింది..దీనికి మీ స్పందన ఏమిటి అని మెగాస్టార్ చిరంజీవి ని అడగగా, ఆయన దానికి సమాధానం ఇస్తూ ‘#RRR సినిమా దేశం గర్వించదగ్గ సినిమాలలో ఒకటి..నా బిడ్డ రామ్ చరణ్ తో పాటు..నా బిడ్డతో సమానమైన ఎన్టీఆర్ కూడా ఎంతో అద్భుతంగా నటించాడు..వీళ్లిద్దరి లో ఎవరికీ ఆస్కార్ అవార్డు వచ్చిన నాకు సంతోషమే..ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక్క ఇండియన్ యాక్టర్ కూడా ఆస్కార్ అవార్డు నామినేషన్స్ కి ఎంపిక అవ్వలేదు..ఒకవేళ ఎన్టీఆర్ కి అనుకున్న విధంగా ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్ దొరికితే ప్రతి తెలుగువాడు గర్వపడుతాడు..అది నిజంగా జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..మరో పక్క ఈ ఆస్కార్ అవార్డ్స్ విషయం లో ఎన్టీఆర్ ఫాన్స్ మరియు రామ్ చరణ్ ఫాన్స్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో కొట్టుకుంటున్నారో రోజు మనం చూస్తూనే ఉన్నాం..చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ తర్వాతైనా వాళ్ళు ఫ్యాన్ వార్స్ ఆపుతారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *