కార్తికేయ 2 మూవీ పబ్లిక్ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

Movie News Trending

విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో విపరీతమైన అంచనాలను ఏర్పర్చుకున్న సినిమాలలో ఒకటి యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం..విడుదలకు ముందు నుండే పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఏర్పర్చుకున్న ఈ సినిమా విడుదల తర్వాత మొదటి రోజు మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది..డైరెక్టర్ చందు మొలేటి దర్శకత్వ ప్రతిభకి మరియు ఎప్పుడు కొత్త రకమైన కథలతో ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే ప్రయత్నం చేసే నిఖిల్ కి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు..ఇక వరుస డిజాస్టర్స్ తో డీలాపడిపోయిన టాలీవుడ్ కి ఇటీవలే విడుదలైన భింబిసారా మరియు సీతారామం సినిమాలు ఊపిరి పోస్తే..కార్తికేయ 2 సినిమా టాలీవుడ్ కి మరోసారి పూర్వ వైభవం రప్పించి పీక్ స్టేజికి తీసుకెళ్లింది..ఈ సినిమాకి వస్తున్న మొదటి రోజు ఓపెనింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం నివ్వెరపోయారు..అంతలా ఈ సినిమా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే ప్రముఖ డాక్టర్ కార్తీక్ కుమారస్వామి(నిఖిల్ సిద్దార్థ్) తన తల్లి మొక్కుకున్న మొక్కుని తీర్చడానికి ద్వారకా నగరం కి వస్తాడు..అక్కడ ఈయనకి శ్రీ కృష్ణుడి కంకణం దొరుకుతుంది..ఈ కంకణం కోసం విలన్స్ కార్తికేయ పై ఎన్నో దాడులు చేస్తారు..ఎందుకంటే ఆ కంకణం అంత విలువైన వస్తువు కాబట్టి..ఈ నేపథ్యం లో ముగ్ద అనే అమ్మాయి(అనుపమ పరమేశ్వరన్) హీరో కి పరిచయం అవుతుంది..ఆమె సహాయంతో హీరో హీరో ఎలా ఆ శ్రీ కృష్ణుని కంకణం ని చేరాల్సిన చోటు కి చేర్చాడు అనేది ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు చందు మొలేటి..ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తూ వెళ్తుంది ఈ సినిమా..రొటీన్ సినిమాలకు బిన్నంగా కొత్తరకాన్ని కోరుకునే ఆడియన్స్ కి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది..ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడుతున్న సినిమాలు కూడా అలాంటివే..రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిపోయింది..దానికి ఉదాహరణగా నిలిచినా సినిమానే ఇటీవల నితిన్ హీరో గా నటించిన మాచెర్ల నియోజకవర్గం సినిమా..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కి నెగటివ్ టాక్ వచ్చింది..ఈ సినిమా పరాజయం కూడా కార్తికేయ 2 కి బాగా కలిసొచ్చిన అంశం.

మరో విషయం ఏమిటి అంటే నిఖిల్ మీడియం రేంజ్ హీరో కదా..ఆయన కోసం థియేటర్ కి ఎందుకు వెళ్లడం..OTT లో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటారేమో..అలా అనుకుంటే మాత్రం మీరు ఒక గొప్ప అనుభూతిని మిస్ అవుతున్నట్టే లెక్క..ఎందుకంటే ఈ సినిమాని కచ్చితంగా థియేటర్ లో చూసి తీరాల్సిందే అంటూ ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 13 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది..ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న ఓపెనింగ్స్ ని చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుతుందని..ఫుల్ రన్ లో కచ్చితంగా 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తుందని..ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఆడుతుందా లేదా అనేది చూడాలి..మరో విషయం ఏమిటి అంటే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసుకొని హిందీ లో కనుక విడుదల చేస్తే సంచలన విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట..ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ వాళ్ళ అభిరుచికి టగట్టే ఉంటుంది..మరి ఈ సినిమా నిర్మాతలు ఆ ఛాన్స్ ని వాడుకుంటారో లేదా మిస్ చేసుకుంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *