కార్తికేయ 2 సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి

Movie News Trending

యంగ్ హీరో నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ 2 చిత్రం ఇటీవలే విడుదలై ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మన అందరికి తెలిసిందే..2014 వ సంవత్సరం లో నిఖిల్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచినా కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా కావడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మొదటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోవడం తో ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురు చూసారు..అలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటు ఈ సినిమా ఎట్టకేలకు ఈ నెల 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలైంది..విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమాకి తక్కువ థియేటర్స్ అయ్యినప్పటికీ కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి..అమెరికా నుండి అనకాపల్లి వరుకు ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి.

అలా మొదటి మూడు రోజులకు గాను ఈ సినిమా దాదాపుగా 16 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు కలిపి కేవలం 13 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది..ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తాన్ని ఈ సినిమా మూడు రోజుల లోపే వసూలు చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ఈ సినిమాకి రెండు వారల ముందుగా వచ్చిన కళ్యాణ్ రామ్ భింబిసారా చిత్రం ఇలాగె మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది..ఆ సినిమా తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో ఈ చిత్రం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చూస్తుంటే టాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది అనే అనిపిస్తుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఇంత సక్సెస్ సాధించడం తో హైదరాబాద్ లో ఈ చిత్రం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు..ఈ సక్సెస్ మీట్ లో టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాతలందరూ హాజరై చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియచేసారు.

అయితే ఈ సక్సెస్ మీట్ లో హీరో నిఖిల్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము ఊహించలేదు..హిందీ లో ఎదో సరదాకి విడుదల చేసాము..మొదటి రోజు కేవలం 30 నుండి 40 షోలు మాత్రమే పడింది..కానీ నేడు 1200 షోస్ కి పెరిగింది..ఈరోజు వర్కింగ్ డే అయినా కూడా ముంబై లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి..ఇది చూసి ఎంత ఆనందంగా ఉందొ మాటల్లో చెప్పలేను..ఇందాక అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ ఈ సినిమా లోని సన్నివేశాల గురించి వివరిస్తూ ఉంటె నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి..ఆయన మాటలు వింటుంటే ఈ సినిమాని ఆయన ఎంత బాగా అర్థం చేసుకొని చూసారో తెలుస్తుంది..ఇక ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వగానే మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి కృతఙ్ఞతలు తెలిపాడు..చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని..ఈరోజు ఆయనే నా సినిమా చూసి నాకు శుభాకాంక్షలు తెలియచేయడం ఎంత సంతోషం గా ఉందొ మాటల్లో చెప్పలేను’ అంటూ నిఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *