చనిపొయ్యే ముందు ఉమామహేశ్వరి గారు అనుభవించిన టార్చర్ ఎలాంటిదో తెలిస్తే ఏడుపు ఆపుకోలేరు

Movie News Trending

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో కంఠమనేని ఉమా మహేశ్వరి ఉరివేసుకుని ఆత్మహత్య కలకలం రేపింది. ఉమా మహేశ్వరి ఎవరో కాదు.. దివంగత మహా నటుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉమా మహేశ్వరి మృతిపై ఆమె కుమార్తె దీక్షిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్య సంగతి బయటకు వచ్చింది. దీక్షిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతోనే తమ తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు దీక్షిత వెల్లడించింది. భోజనం చేసే సమయానికి తన తల్లి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి గది తలుపు తెరిచేందుకు ప్రయత్నించినట్లు దీక్షిత వివరించింది. ఏదేమైనా మొత్తానికి ఉమా మహేశ్వరి మరణం నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

అయితే ఉమా మహేశ్వరి జీవితం చాలా విషాదంతో నిండింది. పైకి చలాకీగా కనిపించినా ఆమె జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయని ఇటీవల ఆమె మరణం కారణంగా కొన్ని విషయాలు బహిర్గతం అయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్‌కు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో దగ్గుపాటి పురంధేశ్వరి ఒకరు. రెండో కుమార్తె చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి. మూడో కుమార్తె లోకేశ్వరి కాగా చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వరి జీవితంలో మాత్రం చాలా విషాదం చోటుచేసుకుంది. ఆమెను నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఇచ్చి ఎన్టీఆర్ పెళ్లి చేశారు. అయితే ఆయన చాలా శాడిస్ట్‌గా బిహేవ్ చేసేవాడు. సిగరెట్‌తో కాల్చేవాడని ఉమా మహేశ్వరి తన తండ్రికి కష్టాలు చెప్పుకోవడంతో అప్పట్లో ఎన్టీఆర్ నరేంద్ర రాజన్‌తో తన కుమార్తెకు విడాకులు ఇప్పించి శ్రీనివాస్ ప్రసాద్‌కు ఇచ్చి రెండో వివాహం జరిపించారు. రెండో వివాహం కూడా ఆమె జీవితంలో సంతోషాన్ని నింపలేకపోయింది. ఇటీవల ఉమామహేశ్వరి పెద్ద కుమార్తెకు అమెరికా సంబంధం చూసి ఘనంగా వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఆమె మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు పలువురు చెప్తున్నారు. ఆమె అంతిమ యాత్రలో బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, చంద్ర బాబు సహా నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తన మేనత్త ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఎన్టీఆర్, అతడి భార్య లక్ష్మీ ప్రణతి పరామర్శించారు. మేనత్త ఉమా మహేశ్వరి కూతుళ్లను ఓదార్చి ధైర్యం చెప్పారు. మేనత్త మరణంపై ఎన్టీఆర్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు.

మరోవైపు ఉమామహేశ్వరిది సహజ మరణం కాదని.. ఆమె తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు. గత సోమవారం ఉదయం 10 గంటలకు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఆమె మధ్యాహ్నం వరకు బయటకు రాకపోవడంతో పనిమనిషి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తలుపు తట్టి ఆమెను పిలవడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో మరోసారి పనిమనిషి లేపే ప్రయత్నం చేసినట్లు వివరించారు. గతంలోనూ చాలా సార్లు తలుపులు వేసుకుని గంటల తరబడి గదిలోనే ఉమామహేశ్వరి ఉండేదని.. ఆరోజు కూడా అలాగే గదిలో ఉన్నారని.. గాఢనిద్ర పోతున్నారని ఎవరూ బలవంతంగా లేపే ప్రయత్నం చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చిన్న కూతురు, అల్లుడు తలుపులు బలవంతంగా నెట్టి లోపలకు వెళ్లి.. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఉమామహేశ్వరిని చూశారని.. వెంటనే చున్నీని కట్ చేసి డెడ్‌బాడీని కిందకు దించారని తెలిపారు. మరోవైపు ఉమామహేశ్వరి భర్త మూడురోజులుగా ఇంట్లో లేడని సమాచారం. ఆమె మరణవార్త తెలుసుకున్న తర్వాతే ఆయన ఇంటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *