చనిపొయ్యే ముందు ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరీ గారు చివరి వీడియో చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

Movie News Trending

గత కొద్దీ రోజుల నుండి ఇండస్ట్రీ మొత్తం సాగుతున్న ప్రధాన చర్చ ఉమామహేశ్వరి గారి ఆత్మా హత్య వ్యవహారం..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి చివరి సంతానం అవ్వడం తో ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు నందమూరి కుటుంబ సభ్యులంతా..ముఖ్యంగా ఎన్టీఆర్ తర్వాత ఆమెని అదే స్థాయిలో అభిమానించే వ్యక్తి నందమూరి బాలకృష్ణ..ఏ చిన్న సమస్య వచ్చిన వెంటనే ఆమె ముందు వాలిపొయ్యి ఆ సమస్యని పరిష్కరిస్తాడు బాలయ్య..ప్రతి రాఖీ పండగకి చెల్లి దగ్గరకి మిస్ కాకుండా వెళ్తాడు బాలయ్య..ఆరోజు ఎన్ని పనులు ఉన్నా అన్నీ మానుకుంటాడు..అంత ప్రేమగా చూసుకున్న తన చెల్లి ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపొయ్యే దుస్థితి రావడం తో బాలయ్య బాబు పడే బాధ అంతా ఇంతా కాదు..ఎప్పుడు గంభీరంగా గర్జించే సింహం లాగ కనిపించే బాలయ్య బాబు కంటతడి పెట్టడం మనం ఇది వరుకు ఎప్పుడు చూడలేదు..చనిపోయిన దగ్గర నుండి అంత్యక్రియలు పూర్తయ్యే వరుకు అన్నీ కార్యక్రమాలు కూడా బాలయ్య బాబు స్వయంగా పర్యవేక్షించి చూసుకున్నారు అంటే తన చెల్లెలు మీద ఆయనకీ ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇది ఇలా ఉండగా ఉమామహేశ్వరి గారు ఇంతకు ముందు అనేకసార్లు మీడియా ముందుకి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి..గత ఏడాది డిసెంబర్ నెలలో అసెంబ్లీ లో జరిగిన పెద్ద రొచ్చు సంఘటన అంత తేలికగా ఎవ్వరు మరచిపోలేము..వైసీపీ పార్టీ కి చెందిన కోడలి నాని మరియు వల్లభనేని వంశి చంద్ర బాబు నాయుడు ని సభా సమక్షం లోనే అమ్మలెక్కలు తిట్టడం..తన సొంత భార్య ని కూడా తిట్టడం చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపొయ్యాడు..మీడియా ముందుకి వచ్చి ఆయన ఏడ్చాడు కూడా..ఈ సంఘటన అప్పట్లో కలకలం రేపింది..నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం దీని పై స్పందించి వైసీపీ పార్టీ పై విరుచుకుపడ్డారు..జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య బాబు సైతం ఈ వ్యాఖ్యలపై చాలా తీవ్రంగా స్పందించారు..బాలయ్య బాబు అయితే తన అక్కా చెల్లెళ్లను కూడా మీడియా ముందుకి తీసుకొచ్చాడు..వారిలో ఉమామహేశ్వరి గారు కూడా ఉన్నారు..ఎంతో చలాకీగా ఆమె అక్కడ వచ్చిన వారిని రిసీవ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు.

అంత చలాకిగా ఉన్న మనిషి 8 నెలల్లో ఏ కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంది అనేది ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న..చాలా కాలం నుండి ఆమె తీవ్రమైన అనారోగ్యం ని ఎదురుకుంటుందని..ఆ బాధని భరించలేకనే ఆత్మా హత్య చేసుకొని ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు మీడియా కి తెలియచేసారు..మరో పక్క ప్రత్యర్థి రాజకీయ నాయకులైతే ఉమామహేశ్వరీ గారి మరణం వెనుక చంద్ర బాబు నాయుడు గారి హస్తం ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..రాజకీయాల్లో ఇలాంటి దిగజారుడు కామెంట్స్ చూసి చూసి మనకి అలవాటు అయిపోయింది అనే చెప్పాలి..పోస్టు మార్టం రిపోర్టు లో కూడా ఉమామహేశ్వరి గారిది ఆత్మహత్య అని తేలినా కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అంటే ఏమి అనుకోవాలో కూడా అర్థం కావడం లేదు అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తున్నారు..కానీ ఉమామహేశ్వరి గారి ఆఖరి వీడియో చూస్తుంటే ఆమె ఎలాంటి అనారోగ్యం లేని ఆమె లాగ అనిపిస్తుంది..కానీ ఏది ఏమి జరిగిన ఉమా మహేశ్వరీ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు..చనిపొయ్యే ముందు ఒకసారి ఆమె ఆలోచించి ఉంటె బాగుండేది..కానీ పోయినవాళ్లను వెనక్కి తిరిగి తీసుకొని రాలేము కదా..ఆమె ఆత్మా ఎక్కడ ఉన్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *