జబర్దస్త్ కమెడియన్స్ అందరూ బయటకి రావడానికి కారణం నాగబాబేనా?? బయటపడ్డ షాకింగ్ నిజం

Movie News

చిరంజీవి తమ్ముడిగా నాగబాబు కి ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది..అంతే కాకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆయన మంచి పాపులర్..ఇప్పటి వరుకు ఆయన దాదాపుగా 50 సినిమాలకు పైగా క్యారక్టర్ ఆర్టిస్టుగా పని చేసాడు..అంతే కాకుండా నిర్మాతగా కూడా ఆయన రుద్రవీణ వంటి జాతీయ అవార్డులను సంపాదించిన సినిమాలు కూడా తీసాడు..ఇక బుల్లితెర మీద ఆయన జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంతతి పాపులారిటీ సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఒక్క మాటలో చెప్పాలంటే ఈ షో కి జడ్జి గా వ్యవహరించి నాగబాబు సంపాదించిన పేరు తో పోలిస్తే ఇండస్ట్రీ లో ఆయనకీ వచ్చిన పేరు తక్కువే అని చెప్పాలి..వెండితెర మీద కంటే బుల్లితెర మీదనే ఆయన ఎక్కువ పాపులారిటీ ని సంపాదించాడు..అయితే మల్లెమాల క్రియేషన్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తో ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా ఆయన ఈ షో ని వదిలివేసాడు..నాగబాబు షో ని వదిలేయడం తో ఆయనతో పాటు అప్పట్లోనే కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ షో ని వదిలి బయటకి వచ్చేసారు.

అయితే ఇప్పుడు ఈ షో కి ఆయువుపట్టులాగా ఉంటూ వస్తున్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది వంటి వారు కూడా ఈ షో నుండి బయటకి వచ్చేయడం జబర్దస్త్ TRP రేటింగ్స్ అతి దారుణంగా పడిపోయాయి..హైపర్ ఆది ప్రస్తుతానికి జబర్దస్త్ షో మానేసి శ్రీ దేవి డ్రామా కంపెనీ మరియు ఢీ వంటి షోస్ లో పాల్గొంటున్నాడు..త్వరలోనే ఈ షోస్ కి కూడా ఆయన టాటా చెప్పబోతున్నట్టు సమాచారం..ఇక సుమారు పదేళ్ల నుండి జబర్దస్త్ షో కి యాంకర్ గా పని చేస్తున్న అనసూయ కూడా ఈ షో కి ఇటీవలే గుడ్బై చెప్పి మాటీవీ కి వెళ్ళిపోయింది..ఈమె ఈ కామెడీ షో ద్వారానే మంచి పాపులారిటీ ని సంపాదించింది..ఆ తర్వాత సినిమాల్లో కూడా అద్భుతమైన అవకాశాలను సంపాదించింది..ఇప్పుడు ఈమెకి సినిమాల్లో ఎంత డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇటీవలే పుష్ప సినిమాతో ఈమె పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ ని సంపాదించింది..అయితే వీళ్ళందరూ షో ని వదిలి వెళ్లిపోవడానికి కారణం నాగబాబు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నాగబాబు జబర్దస్త్ షో ని వదిలి బయటకి వచ్చిన తర్వాత ఆయన సొంత నిర్మాణ సంస్థలో జీ తెలుగు లో అదిరింది అనే ప్రోగ్రాం ని చేసాడు..జబర్దస్త్ షో నుండి కొంతమంది కమెడియన్స్ ని తీసుకొని ఈ షో చేసాడు నాగబాబు..ఒక్కరిద్దరి స్కిట్స్ తప్ప మిగిలిన వాళ్ళవి పెద్దగా పేలకపోవడం తో ఈ షో ఫ్లాప్ గా నిలిచింది..దీనితో ఇప్పుడు నాగబాబు స్టార్ మా ఛానల్ లో జబర్దస్త్ లాంటి కామెడీ షో ని ప్లాన్ చేస్తున్నాడట..దీనికోసమే ఆయన జబర్దస్త్ కి మొదటి నుండి ఆయువు పట్టులాగా ఉంటున్న కమెడియన్స్ మరియు యాంకర్స్ ని పోగు చేసి షో చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు..ఇప్పటికే సుధీర్, గెటప్ శ్రీను మరియు ఆది వంటి వారికి జబర్దస్త్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ఇచ్చే డబ్బులు కంటే భారీ మొత్తం మీద ప్యాకేజి ని ఆఫర్ చేసాడట..త్వరలోనే ఈ కామెడీ షో స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కాబోతుంది అని సమాచారం..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *