జూనియర్ ఎన్టీఆర్ గురించి సోనుసూద్ మాట్లాడిన ఈమాటలు వింటే ఆశ్చర్యపోతారు

Movie News Trending

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టులతో ఒకరు సోను సూద్..కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయం లో ఎన్నో వేల మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు..సినిమాల్లో విలన్ గా ప్రేక్షకులలో ఒక ముద్ర పడిన వ్యక్తికీ రియల్ లైఫ్ లో హీరో ఇమేజి రావడం అంటే మాములు విషయం కాదు..ఆయన చేసినన్ని సహాయాలు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోలు కూడా చెయ్యలేదు అనడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు..ఈ కాలం లో ఎలాంటి ఫలితం ఆశించకుండా ఇలా సహాయపడేవారు ఎంతమంది ఉంటారు!..సోను సూద్ తొలుత సినిమాల్లో హీరో అవ్వాలనే కలతోనే ఇండస్ట్రీ కి వచ్చాడు..కానీ అన్ని అనుకున్నట్టే జరగవు కదా..హీరో అవ్వడానికి బదులు సినిమాల్లో పెద్ద విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు..అయితే సోను సూద్ కెరీర్ గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికామైన విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

సోను సూద్ సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు ఒక టాప్ మోడల్..ఆయన తొలిసారి వెండితెర మీద కనిపించింది తమిళ సినిమాతోనే..తమిళ టాప్ హీరో విజయ్ కాంత్ నటించిన ‘కాళ్ళాగజార్’ అనే సినిమా తో మెయిన్ విలన్ గా పరిచయం అయ్యాడు..కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు..ఆ తర్వాత ఆయన దాదాపుగా 20 సినిమాల్లో నటించాడు..కానీ ఏ సినిమాలో కూడా ఆయనకీ ఆశించిన స్థాయిలో గుర్తింపు ని తెచ్చిపెట్టలేకపోయింది..అయితే ఆయనకీ టాలీవుడ్ లో మొదటిసారి మంచి గుర్తింపుని తెచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘అశోక్’ అనే సినిమా..ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఢీ అంటే ఢీ అనే విధంగా సోను సూద్ పాత్ర ఉంటుంది..ఈ సినిమాలో సోను సూద్ కి పట్టుబట్టి అవకాశం ఇప్పించింది ఎన్టీఆర్ గారేనట..ఆ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కి వేరే అతనిని విలన్ గా తీసుకోవాలనే ఆలోచన ఉంటె మనకి ఇతను అయితేనే సరిగ్గా ఉంటాడు అని పట్టుబట్టి సోను సూద్ ని అశోక్ సినిమాలో నటింపచేసాడట ఎన్టీఆర్.

ఈ సినిమా లో సోను సూద్ యాక్టింగ్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి తెగ నచ్చేసింది..అప్పుడే ఆయన అనుష్క తో అరుంధతి అనే సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు..కానీ పశుపతి పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని తలలు పట్టుకుంటున్న సమయం లో సోనూసూద్ శ్యామ్ గారి దృష్టిలో పడ్డాడు..అంతే వెంటనే ఆ చిత్ర దర్శకుడు కోడి రామ కృష్ణ గారిని తన వెంట పెట్టుకొని సోను సూద్ ని కలిసి కథ వినిపించారు..కథ వినగానే ఆ అఘోర క్యారక్టర్ కి నేను రాంగ్ సెలక్షన్ ఏమో సార్..నాకు సరిపడదు అని సున్నితం గా రిజెక్ట్ చెయ్యడానికి చూశాడట..కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ‘మీకు ఆ గెటప్ వెయ్యిస్తాను..అది చూసిన తర్వాత కూడా మీరు ఈ పాత్రకి సరిపోరు అనుకుంటే మీ ఇష్టం’ అంటూ చెప్పాడట..వెంటనే పశుపతి గెటప్ వేసుకొని చూసుకున్న తర్వాత సోను సూద్ తన అవతారం చూసి తానే బయపడ్డాడట..ఈ పాత్ర నేను చేస్తున్నాను సార్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేసాడు..ఇక తర్వాత హిస్టరీ ఏమిటో మన అందరికి తెలిసిందే..అది ఎలాంటి సంచలన విజయం సాధించిందో..ఎలాంటి రికార్డ్స్ ని తిరగరాసిందో..సోను సూద్ కి ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టిందో..ఈ సినిమా తర్వాత ఆయన రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెరిగిందో మనం అంతా చూసాము..అయితే ఇంత సక్సెస్ కి పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ కారణం అని చెప్తూ ఉంటాడు సోను సూద్..ఆయన నాకు అశోక్ సినిమాలో అవకాశం ఇవ్వకపోయాయి ఉంటె ఇదంతా జరిగేది కాదు అని గట్టిగ నమ్ముతాడు అట సోను సూద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *