డిజాస్టర్ టాక్ తో కూడా లాభాలు రప్పించిన రౌడీ బాయ్..ఇది మాములు మాస్ కాదు

Movie News Trending

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కి డిజాస్టర్ టాక్ వచ్చింది..ఆన్లైన్ లో విపరీతమైన నెగటివిటీ ఈ సినిమా మీద ఏర్పడింది..అయినా కూడా యూత్ లో క్రేజ్ బాగా ఉండడం తో ఈ సినిమాకి ఓపెనింగ్స్ వరుకు పగిలిపోయాయి అనే చెప్పొచ్చు..కానీ ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి కనీసం 15 కోట్ల రూపాయిల ఓపెనింగ్స్ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి రావాలి..కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా 15 కోట్లు షేర్ ని మొదటి రోజు వసూలు చెయ్యలేకపోయింది..హైప్ బాగా ఉండడం తో బయ్యర్స్ ఈ సినిమాని కొనడానికి ఎగబడ్డారు..ఎంత రేట్స్ చెప్పినా కూడా కళ్ళు మూసుకొని తీసేసుకున్నారు..అలా ఈ సినిమా అన్ని భాషలకు కలిపి స్టార్ హీరో రేంజ్ లో 90 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మొదటి రోజు 13 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ చిత్రం వీకెండ్ కి 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..అంటే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో పావు శాతం రికవరీ అన్నమాట..ఇక వీకెండ్ తర్వాత కూడా కాస్త డీసెంట్ వసూళ్లను రాబట్టగలిగితే ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా తెలుగు వెర్షన్ నుండి 40 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది..ఇక హిందీ వెర్షన్ వసూళ్లు కూడా ఈ వీకెండ్ వరుకు బాగానే ఉండేట్టు ఉన్నాయి..నిన్న తెలుగు మరియు తమిళ వెర్షన్స్ విడుదల అవ్వగా..ఈరోజు హిందీ వెర్షన్ విడుదల అయ్యింది..మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసిన ఈ సినిమా వీకెండ్ కి 8 నుండి 10 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని తెలుస్తుంది..ఫుల్ రన్ లో 13 కోట్ల రూపాయిల వసూళ్లను కూడా రాబట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు.

అలా ఫుల్ రన్ లో అన్ని వెర్షన్స్ కి క్లోసింగ్ టైం కి ఈ సినిమా 50 కోట్ల రూపాయిల షేర్ కి దగ్గర్లో వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇదే కనుక జరిగితే 50 శాతం కి పైగా రికవరీ జరిగినట్టే అని చెప్పొచ్చు..డిజాస్టర్ టాక్ వస్తేనే ఇలాంటి వసూళ్లు వచ్చాయి..ఒకవేళ మంచి టాక్ వచ్చి ఉంటె విజయ్ దేవరకొండ 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి ఉండేవాడని..బంగారం లాంటి అవకాశం ని పూరి జగన్నాథ్ నాశనం చేశాడంటూ సోషల్ మీడియా లో విజయ్ అభిమానులు బాధ పడుతున్నారు..ఇతనిని నమ్మి విజయ్ దేవరకొండ ‘జన గణ మన’ అనే సినిమాని కూడా ఒప్పుకున్నాడని..తన ప్రైమ్ టైం ని మొత్తం నాశనం చేసుకుంటున్నాడని అభిమానులు వాపోతున్నారు..లైగర్ సినిమాకి చేసినట్టు నిర్లక్ష్యం చెయ్యకుండా పూరి జగన్నాథ్ ‘జన గణ మన’ సినిమాని అయినా కసితో తీస్తాడో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *