నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ 3 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

Movie News

అక్కినేని నాగ చైతన్య హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..మనం వంటి సెన్సషనల్ హిట్ సినిమాని తీసిన దర్శకుడు నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది..కానీ ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ మాత్రం మొదటిలో ఆట నుండే డివైడ్ గా ఉన్నది..దాని ఫలితం ఈ సినిమా పై దారుణంగా పడింది..దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కూడా పడుతుండడంతో ఓపెనింగ్స్ పై చాలా తీవ్రమైన ప్రభావం పడింది..రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా కనీసం 2 కోట్ల రూపాయిల వసూళ్లను కూడా రాబట్టలేకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది..అందులోనూ నాగ చైతన్య వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు..సినిమా ఎలా ఉన్నాకూడా ఓపెనింగ్స్ వరుకు బాగా వస్తుందనుకున్నారు..కానీ నాగ చైతన్య సక్సెస్ స్ట్రీక్ ఈ సినిమాకి ఏ మాత్రం కూడా ఉపయోగపడకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయం.

మొదటి రోజు వసూళ్లు హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా రెండవ రోజు నుండి పుంజుకుంటుందిలే అని అభిమానులు అనుకున్నారు..కానీ రెండవ రోజు అయితే ఇంకా దారుణంగా వసూళ్లు పడిపోయాయి..మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం 1 కోటి 65 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా..2 వ రోజు కేవలం కోటి రూపాయిలు మాత్రమే వసూళ్లను
రాబట్టింది..అయితే మొదటి రెండు రోజులతో పోలిస్తే మూడవ రోజు వసూళ్లు మాత్రం పర్వాలేదు అని అనిపించింది..ఆదివారం కావడం తో ఫామిలీ అడియన్సు కాస్త థియేటర్స్ కి రావడం పెట్టారు..దీనితో మొదటి రోజు వసూళ్లకు 10 లక్షల రూపాయిలు తక్కువగా 1 కోటి 50 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది..అలా ఈ సినిమా మూడు రోజులకు కలిపి కేవలం 4 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే సాధించింది..ఇక ఓవర్సీస్ , కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల పరిస్థితి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..అంత దారుణంగా ఉన్నాయి అన్నమాట..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజులకు కలిపి 5 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది.

నాగ చైతన్య గత చిత్రాలైన ‘లవ్ స్టోరీ’ మరియు ‘బంగార్రాజు’ వంటి సినిమాలకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి..ఈ రెండు సినిమాలకు మొదటి రోజు చెరో 8 కోట్ల రూపాయిల షేర్స్ వచ్చాయి..లవ్ స్టోరీ సినిమాకి అయితే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ మీద 8 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..ఇది నిజంగా అరాచకం అనే చెప్పాలి..ఆ స్థాయి ఓపెనింగ్స్ చూసిన తర్వాత ఇలాంటి దారుణమైన ఓపెనింగ్స్ చూడడం నిజంగా అభిమానులకు మింగుడు పడని విషయం..మరో దారుణం ఏమిటి అంటే కొన్ని థియేటర్స్ మొదటి రోజు సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరి మట్ట’ సినిమా వసూళ్లకంటే మొదటి రోజు తక్కువ వసూళ్లను రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..ఇటీవల ప్రేక్షకులు OTT కి బాగా అలవాటు పడి థియేటర్స్ కి రావడం మానేశారు అని చెప్పడానికి ఈ సినిమా వసూళ్లే నిదర్శనం గా చెప్పుకోవచ్చు..సుమారు 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పుడు ఫుల్ రన్ లో కనీసం 10 కోట్ల రూపాయిలు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు..వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్ రాజు కి ఇది నిజంగా చావు దెబ్బ అని చెప్పక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *