నువ్వే కావాలి హీరోయిన్ పాపం ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు

Movie News

తరుణ్ నటించిన నువ్వే కావాలి సినిమాను ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. ఈ సినిమా 2000, అక్టోబర్ 13న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. హీరో తరుణ్‌కే కాకుండా హీరోయిన్ రిచాకు కూడా ఇదే తొలి సినిమా. విజయ్ భాస్కర్.కె దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఇప్పటి స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందించాడు. కోటి అందించిన పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. ఉషాకిరణ్ మూవీస్, స్రవంతి మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. కోటి అందించిన పాటల్లో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది అనే పాట చాలా ఫంక్షన్‌లలో వినిపిస్తుంటుంది. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు అనే పాట ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైతే మంచి టీఆర్పీ రేటింగ్ సంపాదిస్తుంది.

నువ్వేకావాలి సినిమా తర్వాత తరుణ్ స్టార్ హీరో అయ్యాడు. వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రిచాకు మాత్రం ఇలాంటి సక్సెస్ రాలేదు. రిచా బెంగళూరులో పుట్టింది. అన్ని భాషలపై పట్టు సాధించింది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకుని తర్వాత సినిమా కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయింది. నువ్వేకావాలి తర్వాత నా మనసిస్తా రా, చిరుజల్లు వంటి సినిమాల్లో నటించినా అవి రిచా కెరీర్‌కు ఉపయోగపడలేదు. తమిళ స్టార్ హీరో విజయ్‌ సరసన షాజహాన్ అనే సినిమాలో నటించింది. కానీ అది కూడా ప్లాప్ అయ్యింది. యష్ రాజ్ ఫిలింస్‌లో నీల్ అండ్ నిక్కీ అనే సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా పెద్దగా స్టార్ డమ్ తీసుకురాలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తమిళ్ రీమేక్‌లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించింది. కొన్నాళ్ల తర్వాత తెలుగులో రాజా హీరోగా నటించిన ఇంకోసారి అనే సినిమాతో వచ్చింది. ఆ సినిమా కూడా ఆదరణ పొందలేకపోయింది. దీంతో రిచా పల్లోడ్ సినిమాలకు బ్రేక్ చెప్పి వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

22 ఏళ్ల క్రితం విడుదలైన ప్రేమకథాకావ్యం నువ్వేకావాలి సినిమాను చూస్తున్న ప్రతిసారి అభిమానుల మదిలో తట్టే ప్రశ్న ఏంటంటే.. హీరోయిన్ రిచా ఇప్పుడు ఏం చేస్తుంది? ఎక్కడుంది అంటూ ఆలోచిస్తుంటారు. 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని రిచా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా వెళ్లిపోయింది. అయితే తనకు బాబు పుట్టిన తర్వాత మళ్ళీ బిజీ అవ్వాలనుకున్న రిచా 2016లో మలుపు అనే చిత్రంలో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత మళ్లీ పెద్ద బ్రేక్ పడింది. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుండటంతో 2020లో యువర్ హానర్ అనే వెబ్ సిరీస్‌లో నటించి మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని రిచా భావించింది. ఇటీవల ఈ సిరీస్‌కు సీక్వెల్ కూడా విడుదల కాగా ప్రమోషన్‌లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో రిచా కనిపించింది. అయితే సదరు ఇంటర్వ్యూలలో ఆమెను చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరూ గుర్తుపట్టలేనంతగా రిచా మారిపోయింది. కాగా చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన రిచా తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, కన్న‌డ భాష‌ల్లోనూ సినిమాలు చేయడం గమనార్హం.

1

2

3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *