పది మందితో డేటింగ్ చేసి రికార్డు నెలకొల్పిన ప్రముఖ స్టార్ హీరోయిన్

Movie News Trending

మాజీ మిస్ యునివర్స్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె టాలీవుడ్‌లో పలువురు అగ్రహీరోలతో నటించింది. తెలుగులో నాగార్జునతో రక్షకుడు మూవీలో హీరోయిన్‌గా సుస్మితసేన్ నటించింది. కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలోనే పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్‌తో సహజీవనం చేసింది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు. అయితే సుస్మితా సేన్‌పై అనుమానంతో వసీం అక్రమ్ ఆమెను వదిలేశాడు. అనంతరం ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో సుస్మితా సేన్ ప్రేమలో పడింది. రోహ్‌మన్ తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైనా సుస్మితా సేన్ అతడితో ప్రేమాయణం నడిపించింది. కానీ కొద్ది రోజులకే వీరిద్దరూ కూడా విడిపోయారు. 2001లో ఈ తతంగం చోటు చేసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి సుస్మితా సేన్ తన చర్యలతో వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో ఆమె సహజీవనం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల వీరిద్దరూ మాల్దీవులలో ఎంజాయ్‌ చేయడం మీడియా కంట కనిపించింది.

సుస్మితా సేన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు లలిత్ మోదీ అధికారికంగా ప్రకటించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఏదో ఒకరోజు తామిద్దరం పెళ్లి చేసుకుంటామని కూడా లలిత్ మోదీ వెల్లడించాడు. మాల్దీవుల్లో ఎంజాయ్ చేశాక లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానని.. తన జీవిత భాగస్వామి సుస్మితసేన్‌తో కొత్త జీవితం ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉందంటూ లలిత్ మోదీ అభిప్రాయపడ్డాడు. అయితే లలిత్ మోదీ కూడా సుస్మితా సేన్ కంటే వయసులో 13 ఏళ్లు పెద్ద. అతడితో ప్రేమాయణం పట్ల నెటిజన్‌లు సుస్మితపై రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. 56ఏళ్ల లలిత్ మోదీ, 46 ఏళ్ల సుస్మితాసేన్ మధ్య 15 ఏళ్ల క్రితం నుంచే స్నేహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లలిత్ మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి లండన్ పారిపోయాడు. ఆ తర్వాత అతడిపై కేసులు కొనసాగుతుండడంతో వీరిద్దరూ దూరమయ్యారు.

అయితే లలిత్ మోదీ కంటే ముందు సుస్మితా సేన్ చాలా మందితో రిలేషన్ షిప్ మెయింటెన్ చేసింది. వసీం అక్రమ్, రోహ్‌మన్‌తోనే కాకుండా బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్, బంటీ సచ్ దేవ్, ఇంతియాజ్ ఖత్రీ, ముదాస్సర్ అజీజ్, రణదీప్ హుడా, సంజయ్ నారంగ్ వంటి వ్యక్తులతో సుస్మిత సేన్ రిలేషిన్ షిప్ మెయింటెన్ చేసినట్లు రూమర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని అఫైర్లు బయటపడ్డాయి.. కొన్ని బయటపడలేదు. లలిత్ మోదీతో రిలేషన్‌షిప్‌పై సుస్మిత సేన్ కూడా స్పందించింది. ప్రస్తుతం తనకు ఇష్టమైన ప్లేసులో ఆనందంగా ఉన్నానని తెలిపింది. లలిత్ మోదీతో ఇంకా రింగ్స్ మార్చుకోలేదని, పెళ్లి కూడా కాలేదని వివరించింది. జస్ట్ లవ్‌లో మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేసింది. బహుశా ఈ క్లారిటీ మీడియాకు సరిపోతుందని భావిస్తున్నట్లు అభిప్రాయపడింది. మీడియా కూడా వాళ్ల విషయాలపై ఫోకస్ పెడితే బాగుంటుందని సెలవిచ్చింది. తన సంతోషాన్ని పంచుకునేవారికి ధన్యవాదాలు తెలియజేసింది. తన సంతోషాన్ని పంచుకోని వారికి తన గురించి ఏం అవసరం లేదని ఈ అమ్మడు వాపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *