పూరి జగన్నాథ్ ని బ్రతిమిలాడుతూ ఆయన కొడుకు ఎలా ఏడుస్తున్నాడో చూడండి

Movie News Trending

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ తప్పకుండా ఉంటారు. ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన పూరీ ఇటీవల కొంచెం డౌన్ అయినా హీరోలు ఆయనపై నమ్మకాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఎందుకంటే పూరీ సినిమాలలో హీరో క్యారెక్టర్‌కు మంచి ఎలివేషన్స్ ఉంటాయి. అందుకే ఆయన దర్శకత్వంలో మూవీ అనగానే ఏ హీరో అయినా కథ వినకుండా ఒప్పేసుకుంటారు. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సైతం పూరీ జగన్నాథ్ వేగంగా సినిమాలను చిత్రీకరిస్తాడు. అయితే ఒక్కోసారి ఆయన కథలు మిస్ ఫైర్ అవుతుంటాయి. టెంపర్ మూవీకి ముందు, తర్వాత పూరీ సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టాయి. జ్యోతిలక్ష్మీ, లోఫర్, ఇజం, రోగ్, పైసా వసూల్, మెహబూబా వంటి డిజాస్టర్లు పూరీ ఖాతాల్లో పడ్డాయి. ఇన్ని ఫ్లాప్‌లు ఇచ్చినా ఇస్మార్ట్ శంకర్ అనే ఒక్క సినిమాతో పూరీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి పెరిగిపోయాయి. అందులోనూ పాన్ ఇండియా సినిమా కావడం, లైగర్ టైటిల్‌కు సాలా క్రాస్ బ్రీడ్ అనే సబ్ టైటిల్ అందరినీ ఆకర్షించాయి.

ఈ నేపథ్యంలో మూడేళ్లుగా పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా కోసమే కష్టపడుతున్నాడు. దీంతో ఫ్యామిలీకి దూరంగా ముంబైలో ఉన్నాడు. ఛార్మి పరిచయం అయ్యాక పూరీ ఎక్కువగా ఇంట్లో ఉండటం లేదని ఇటీవల విమర్శలు కూడా వచ్చాయి. ఇద్దరు పిల్లలకు దూరంగా ఛార్మితో గడపాల్సిన అవసరం ఏమోచ్చిందని బండ్ల గణేష్ సహా పలువురు కామెంట్స్ చేశారు. ఒకానొక సమయంలో ఛార్మితో పూరీ సహజీవనం చేస్తున్నాడని.. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడని కూడా రూమర్స్ వినిపించాయి. అయితే ఆ విమర్శలను పూరీ కుమారుడు ఆకాష్ పూరీ ఖండించాడు. ప్రస్తుతం లైగర్ సినిమా విడుదల కావడంతో ఆకాష్ పూరీ, అతడి సోదరి పవిత్ర పూరీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నాన్న ఎప్పుడూ నా ఫేవరెట్ లవ్ నువ్వే అంటూ పవిత్ర తన సందేశాన్ని పోస్ట్ చేసింది. తాను ఎప్పుడూ ఇంత నర్వస్‌గా ఫీల్ కాలేదని.. ఎందుకంటే లైగర్ రిలీజ్ రోజు నీకు బిగ్ డే అని.. ఈ రోజు కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు అని.. నీ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుంది అని పవిత్ర పూరీ తన పోస్టులో పేర్కొంది. తాము మీ ప్రతి విషయంలో కూడా చాలా గర్వంగా ఉంటామని.. నీ కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటామని పేర్కొంది. రిస్క్ చేయడానికి ఎప్పుడూ భయపడొద్దని మేము నీ దగ్గర నేర్చుకున్నామని.. నిన్ను ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకున్నామని. లైగర్ టీమ్‌కి గుడ్ లక్ అంటూ పవిత్ర సందేశమిచ్చింది.

పూరి జగన్నాథ్‌కు తన కూతురు పవిత్ర అంటే ప్రాణం. గతంలో బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో ఆమె కనిపించింది. అటు ఆకాష్ పూరీ కూడా ఇప్పటికైనా తన తండ్రి ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ సినీ ఎంట్రీ ఇవ్వగా.. అతి త్వరలో ఆయన కూతురు పవిత్ర కూడా సినిమాల్లోకి రానుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే లైగర్ సినిమా చూసిన అభిమానుల్లో కొందరు పూరీపై ఫైర్ అవుతున్నారు. ఒకప్పుడు పోకిరి సినిమా తీసిన పూరి జగన్నాధ్ నేనా ఇప్పుడు లైగర్ మూవీ తీసింది అంటూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. కొందరు మాత్రం తెగించి పూరీ జగన్నాథ్ గతంలో చేసిన తప్పులను బయటకు తవ్వుతున్నారు. ఆ పాపమే నీ పాలిట శాపంగా మారిందంటూ పుండు మీద కారం చల్లినట్టు ఇంకా రెచ్చగొడుతున్నారు. ఇటీవల ఆకాష్ పూరీ చోర్ బజార్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడిన మాటలను కూడా గుర్తుచేస్తున్నారు. జీవితంలో వ్యాంపులు వస్తుంటారు పోతుంటారని.. కానీ వదినమ్మ శాశ్వతం.. పూరీ కోసం ఆయన భార్య పడిన బాధలు ఎన్నో తెలుసు. కొడుకు ఫంక్షన్‌కు రాలేనంత బిజీ అయిపోయావా అంటూ పూరీని బండ్ల గణేష్ కడిగిపారేయగా.. ఇప్పుడు పూరీ భార్య శాపమే లైగర్ సినిమాకు తగిలిందని కొందరు విమర్శలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *