పెళ్ళైన స్టార్ హీరో తో ప్రేమాయణం నడుపుతున్న హీరోయిన్ రష్మిక..అతను ఎవరో మీరే చూడండి

Movie News Trending

సౌత్ ఇండియా లో ప్రస్తుతం మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతున్న నటి రష్మిక..కన్నడ చలన చిత్ర పరిశ్రమలో టాప్ రెండు మూడు హిట్ సినిమాల్లో నటించిన తర్వాత ఈమెకి టాలీవుడ్ లో నాగ సౌర్య హీరో గా నటించిన చలో అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది..తొలి సినిమానే కమర్షియల్ గా మంచి హిట్ సాధించడమే కాకుండా..రష్మిక కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది..మొదటి సినిమానే భారీ హిట్ అవ్వడం తో ఈమెకి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్ల వెల్లువ కురిసింది..వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టి చూస్తూ ఉండగానే అతి తక్కువ సమయం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..డియర్ కామ్రేడ్ మరియు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తప్ప ఇప్పటి వరుకు ఈమె టాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం విశేషం..రష్మిక ఒక సినిమాలో ఉంది అంటే కచ్చితంగా సూపర్ హిట్ అనే భావానికి దర్శక నిర్మాతలు వచ్చేసారు..అందుకే ఆమె తో సినిమాలు చెయ్యడానికి ప్రతి ఒక్కరు అలా క్యూలు కడుతారు.

అయితే పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ లో హిట్ అవ్వడం తో రష్మిక కి బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి..ప్రస్తుతం ఈమె రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎనిమల్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..వీటితో పాటు అమితాబ్ బచ్చన్ తో గుడ్ బాయ్..సిద్దార్థ్ మల్హోత్రా తో మిషన్ మజ్ను వంటి బాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తుంది..అలా రష్మిక మెల్లిగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నాటుకోవడానికి పావులు కదుపుతుంది..ఈ క్రమంగా ఈమె బాలీవుడ్ స్టార్ హీరోలతో మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తుంది..ఇటీవలే కత్రినా కైఫ్ ని పెళ్లాడిన విక్కీ కౌశల్ తో రష్మిక చాలా క్లోజ్ గా ఉండడం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..సోషల్ మీడియా లో కూడా వీళ్లిద్దరు తరుచు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు..ఇవన్నీ చూసిన నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు..పెళ్ళైన అబ్బాయితో రష్మిక ఇంత క్లోజ్ గా ఉంది ఏంటి అంటూ పెదవి విరుస్తున్నారు..కానీ వీళ్లిద్దరు కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని..ఒక అమ్మాయి ఒక అబ్బాయి క్లోజ్ గా ఉంటె మీకు ఇష్టమొచ్చింది రాసేసుకుంటారా అంటూ మీడియా పై విరుచుకుపడింది ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రష్మిక.

బెస్ట్ ఫ్రెండ్స్ కేవలం మగాళ్ళలోనే ఉంటారా..ఒక అమ్మాయి అబ్బాయి ఉండకూడదా..విక్కీ కౌశల్ గారి భార్య కత్రినా కైఫ్ కూడా నాకు బాగా దగ్గర అయ్యింది..కేవలం వీళ్లిద్దరు మాత్రమే కాదు బాలీవుడ్ లో ఎంతో మంది నాకు స్నేహితులు అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది రష్మిక..ఇక ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీత రామం’ రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అన్ని బాషలలో విడుదల కానుంది..ఈ సినిమాలో మలయాళం టాప్ హీరో దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ హీరో హీరోయిన్స్ గా నటించగా, రష్మిక సెకండ్ హీరోయిన్ గా నటించింది..స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఒక వెలుగు వెలుగుతున్న సమయం లో ఇలా సెకండ్ హీరోయిన్ రోల్ చెయ్యడం ఏమిటి అంటూ రష్మిక ని సోషల్ మీడియా లో అభిమానులు అడగగా దానికి ఆమె సమాధానం చెప్తూ ‘కథలో చాలా బలమైన పాత్ర అది..రేపు సినిమా చూసాక మీకే అర్థం అవుతుంది’ అని చెప్పింది..ఇక ఈ సినిమా తర్వాత అతి త్వరలోనే ఆమె ‘పుష్ప ది రూల్’ షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *