ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో తో హీరోయిన్ కైరా అద్వానీ పెళ్లి ఫిక్స్..షాక్ లో ఫాన్స్

Movie News Trending

హీరోయిన్ కియారా అద్వానీ ఎవరో మీకు తెలుసు కదా.. భరత్ అనే నేను సినిమాలో మహేష్‌బాబు సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలోనూ నటించింది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసింది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలోనే నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెళ్లి మీద దృష్టి సారించినట్లు బీటౌన్‌లో తెగ చర్చ నడుస్తోంది. కొన్నిరోజుల క్రితం వరకు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా అద్వానీ ప్రేమాయణం నడిపిందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలపై అటు కియారా.. ఇటు సిద్ధార్థ్ మల్హోత్రా స్పందించలేదు. కానీ ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకు హాజరై తన పెళ్లి గురించి క్లూ ఇచ్చింది. దీంతో త్వరలోనే కియారా అద్వానీ పెళ్లి చేసుకుంటుందని ఫిలింనగర్‌లో జోరుగా చర్చ నడుస్తోంది.

బాలీవుడ్‌ దర్శకుడు కరణ్ జోహార్ ఆధ్వర్యంలో నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ షోలో కరణ్ జోహార్ ఎక్కువగా అతిథులను మసాలా ప్రశ్నలు అడుగుతూ యువత గుండెల్లో కాక రేపుతాడు. అందుకే అందరూ ఈ షోను వీక్షించడానికి ఇష్టపడతారు. ఇప్పటికే ఆరు సీజన్‌లు పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇప్పుడు ఏడో సీజన్‌లో భాగంగా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఏడో సీజన్‌లో ఇప్పటి వరకు జాన్వీ కపూర్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, సమంత, విజయ్, అనన్య పాండే వచ్చారు. ఈ షోలో స్టార్ నటులకు సంబంధించి బెడ్రూం ప్రశ్నలు, సెక్స్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగటంపై కరీనా, అమీర్ ఖాన్ కౌంటర్లు వేశారు. ఈ వారం షాహిద్ కపూర్, కియారా అద్వానీ గెస్టులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా పరిశ్రమలో అత్యంత క్లోజ్‌ ఎవరని కరణ్ జోహార్ కియారాను అడగ్గా ఆమె షాహిద్ పేరే చెప్పింది. అతడు ఫ్రెండ్‌ కంటే ఎక్కువ అంటూ ముసిముసిగా నవ్వింది. అటు షాహిద్ మధ్యలో కల్పించుకుని ఈ ఏడాది చివర్లో ఎప్పుడైనా బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ రావోచ్చు సిద్ధంగా ఉండండి. కానీ అది సినిమాకు సంబంధించినది మాత్రం కాకపోవచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

షాహిద్ కపూర్ చేసిన వ్యాఖ్యలు కియారా అద్వానీ పెళ్లి గురించి చేసినవేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే కొంతమంది వరుణ్ ధావన్‌ను కియారా పెళ్లి చేసుకుంటుందని చెప్తుండగా మరికొందరు మాత్రం సిద్ధార్థ్ మల్హోత్రానే వివాహం చేసుకుంటుందని మాట్లాడుకుంటున్నారు. షేర్షా సినిమాతో సిద్ధార్థ్‌తో కియారా బంధం బలపడింది. అటు ఇటీవల విడుదలైన జుగ్‌ జుగ్‌ జీయో మూవీలో వరుణ్ ధావన్ సరసన కియారా నటించింది. ఈ సినిమా షూటింగ్‌లో కియారా బుగ్గపై కావాలనే వరుణ్ ధావన్ ముద్దు పెట్టాడని ప్రచారం జరిగింది. మరోవైపు సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా రిలేషన్‌ గుట్టు లాగేందుకు కరణ్ ప్రయత్నించాడు. నువ్వు బెడ్ రూంలో దొంగా పోలీస్ ఆటలు ఆడలేదా అని కియారాను అడిగేశాడు. దానికి ఆమె ఈ షోను ఇంట్లో అమ్మ చూస్తూ ఉంటుందని చెప్పగా.. చూడనివ్వండి ఇప్పటివరకు నువ్వు ఇంకా కన్యవనే(వర్జిన్) అనుకొంటుందా..? అని కరణ్ అడిగేశాడు. ఇక దానికి ఇబ్బంది పడిన కియారా.. కచ్చితంగా నేను కన్యననే అనుకుంటున్నాను అని బదులు ఇచ్చింది. ఇక సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం గురించి మాట్లాడుతూ సిద్దార్థ్ తో నువ్వు రిలేషన్‌లో ఉన్నావా..? అని అడగ్గా.. అవును అని చెప్పలేను, కాదు అని చెప్పలేను. మా ఇద్దరి మధ్య స్నేహం కన్నా ఎక్కువ సంబంధం ఉందని కియారా చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ సరసన తెలుగులో ఓ మూవీలో నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *