బాలీవుడ్ లో #RRR ని కూడా క్రాస్ చేసిన కార్తికేయ 2 చిత్రం

Movie News Trending

ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పాన్ ఇండియా సినిమాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’ చిత్రం కూడా ఉంది..ఈ సినిమాకి తెలుగు లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉంది..ఎందుకంటే ఈ సినిమా 2014 సంవత్సరం లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తికేయ అనే సినిమాకి సీక్వెల్ కాబట్టి..దానికి తోడు ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోవడం తో మన టాలీవుడ్ లో కలెక్షన్స్ అదరగొట్టేశాయి..టాలీవుడ్ లో ఒక సినిమాకి టాక్ వస్తే కలెక్షన్స్ కొట్టడం పెద్ద కష్టం ఏమి కష్టం..మన తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీత రామం’ సినిమానే ఎగబడి చూసారు..అలాంటిది నిఖిల్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టు నటిస్తే చూడకుండా ఉంటారా..తప్పకండా చూస్తారు అనడానికి నిదర్శనమే కార్తికేయ 2 చిత్రం వసూళ్లు.

టాలీవుడ్ లో సినిమా బాగుంటే ఆదరిస్తారు కరెక్టే..కానీ మొదటి నుండి సౌత్ ఇండియన్ సినిమాలంటే చిన్న చూపు ఉండే బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ సినిమాని అక్కున చేర్చుకొని అంతలా ఆరాధిస్తారని బహుశా కార్తికేయ 2 టీం కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు..మొదటి రోజు కేవలం 7 లక్షల రూపాయిల నెట్ తో ప్రారంభమైన ఈ సినిమా నేడు 14 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లకు ఎగబాకింది అంటే మాములు విషయం కాదు..మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈరోజు కార్తికేయ 2 హిందీ వెర్షన్ కి ఉన్నన్ని స్క్రీన్స్ మరియు షోస్ #RRR సినిమాకి కూడా లేదట..ఇది నిజంగా కార్తికేయ 2 టీం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం..ఫుల్ రన్ ఇలాగె కొనసాగితే ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్ నుండే 30 కోట్ల రూపాయిలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

ఇక ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు మరి అన్ని భాషలకు కలిపి దాదాపుగా 35 కోట్ల రూపాయిల షేర్ ని కేవలం 9 రోజుల్లోనే వసూలు చేసింది..ఫుల్ రన్ లో ఈ సినిమా 40 కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న పెద్ద ఆశ్చర్యం లేదంటూ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..మరో మూడు రోజుల్లో రాబోతున్న విజయ్ దేవరకొండ లైగర్ కూడా విడుదల అవుతుంది కాబట్టి ఆ సినిమా వసూళ్ల ప్రభావం ఈ చిత్రం పై పడే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి..ఒకవేళ లైగర్ సినిమా ఫ్లాప్ అయితే కార్తికేయ 2 చిత్రానికి మాములు లక్ కాదు..మరో రెండు వారాలు సాలిడ్ థియేట్రికల్ రన్ ని దక్కించుకున్నటు లెక్క..చూద్దాం ఈ సినిమా నెక్స్ట్ స్టాప్ 40 కోట్ల రూపాయిల దగ్గరకెళ్ళి ఆగుతుందా..లేదా 50 కోట్ల రూపాయిలు దగ్గరకెళ్ళి ఆగుతుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *