భింబిసారా కలెక్షన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కళ్యాణ్ రామ్

Movie News Trending

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన బింబిసారా చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని అద్భుతమైన ఓపెనింగ్ ని సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..సినిమా పరిశ్రమ గురించి ఇండస్ట్రీ పెద్దలలో నెలకొన్న ఎన్నో అనుమానాలు మరియు భయాందోళనలు ఈ సినిమా దూరం చేసింది..ప్రేక్షకులను మళ్ళీ థియేటర్స్ వైపు రప్పించేలా చేసింది ఈ సినిమా..కళ్యాణ్ రామ్ కి ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా కాలమే అయ్యింది..గతం లో ఆయన సినిమాలు ఫుల్ రన్ లో 6 నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వస్తే సూపర్ హిట్ అన్నట్టు ఉండేది..కానీ బింబిసారా చిత్రం కేవలం ఆ స్థాయి వసూళ్లను మొదటి రోజే రాబట్టడం విశేషం..మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల రూపాయిలు..అలాగే ప్రపంచవ్యాప్తంగా కలిపి 7 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లు రాబట్టి మొదటి రోజే 50 రికవరీ ని సాధించి సంచలనం సృష్టించింది.

నిన్న సినిమా సక్సెస్ అయినా వెంటనే కళ్యాణ్ రామ్ సక్సెస్ మీట్ పెట్టి అభిమానులకు మరియు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలియచేసాడు..ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖం లో ఉన్న సంతోషం ని నందమూరి అభిమానులు చాలా సంతోషం గా ఫీల్ అయ్యారు..ఎందుకంటే కళ్యాణ్ రామ్ గతం లో నందమూరి ఆర్ట్స్ మీద సినిమాలు నిర్మించి చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు..తీవ్రమైన నష్టాలను భరించాడు..అలాంటి సమయం లో కూడా..తనకి టాలీవుడ్ లో మార్కెట్ మొత్తం పోయింది అని తెలిసి కూడా స్క్రిప్ట్ మీద నమ్మకం ఉంచి 45 కోట్లు పెట్టి సినిమా తీసాడు..ఈరోజు ఆ సక్సెస్ వల్ల వచ్చిన సంతోషం కళ్యాణ్ రామ్ కళ్ళలో మనం చూడొచ్చు..ఇండస్ట్రీ లో పెద్దలు అందరూ సినిమా ఇండస్ట్రీ కి ఎదో అయ్యింది అని సినిమా షూటింగ్స్ కూడా బంద్ చేసి మూలన కూర్చుంటే..కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు..నా సినిమాకి కచ్చితంగా వస్తారు చూడండి అంటూ సవాలు విసిరి మరి తన బింబిసారా సినిమాని విడుదల చేసాడు..ఈరోజు తానూ చెప్పిన మాటలు సత్యం అని అందరికి నిరూపించాడు.

నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ‘ నా మార్కెట్ కి మించి ఈ సినిమా కి బడ్జెట్ పెట్టాను..30 కోట్ల నష్టం తోనే ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేశాను..ఈరోజు ఆడియన్స్ ఈ సినిమాకి ఇచ్చిన గొప్ప ఫలితం ని చూసి నా కడుపు నిండిపోయింది..ఇప్పుడు బింబిసారా పార్ట్ 2 పై ప్రేక్షకులు మరింత బాధ్యత ఇచ్చారు మాకు..కచ్చితంగా వాళ్ళ అంచనాలను అందుకుంటాము’ అని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్..ఇక బింభిసారా కి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఫుల్ రన్ లో కచ్చితంగా 40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది..ఎలాగో పార్ట్ 2 కూడా ఉంటుంది అని అన్నాడు కాబట్టి కచ్చితంగా ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడుతాయి..అద్భుతమైన వసూలు వస్తాయి..కళ్యాణ్ రామ్ .స్థార్ లీగ్ కి కూడా వెళ్లొచ్చు..చూడాలి మరి కళ్యాణ్ రామ్ అదృష్టం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *