మీనా ఇంటికి భారీగా తరలి వచ్చిన పోలీసులు..షాక్ లో కుటుంబ సభ్యులు

Movie News

ఇటీవల కాలం లో సినీ పరిశ్రమ మొత్తాన్ని శోక సంద్రం లోకి నెట్టేసిన వార్త ప్రముఖ హీరోయిన్ మీనా భర్త మరణం..2009 వ సంవత్సరం లో సినిమాల్లో బిజీ ఉన్న సమయం లోనే బెంగళూరు కి చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ని పెళ్లాడిన మీనా..ఇన్నాళ్లు ఎంతో అన్యోయంగా దాంపత్య జీవితం కొనసాగించారు..అంత సంతోషం గా సజావుగా సాగిపోతున్న మీనా జీవితం లో విద్యాసాగర్ చనిపోవడం తీరని లోటు అనే చెప్పాలి..వీళ్లిద్దరికీ నైనికా అనే కూతురు కూడా ఉంది..ఈమె కూడా బాలనటిగా తమిళం లో పలు సినిమాల్లో నటించింది..వాటిల్లో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాలో నైనికా విజయ్ కూతురుగా నటించి మంచి మార్కులే కొట్టేసింది.

భవిష్యత్తులో ఈమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి..కూతురు ఎదుగుతున్న సమయం లో తండ్రి ఇలా చనిపోవడం నిజంగా ఆ కుటుంబానికి ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు..ఇది ఇలా ఉండగా విద్యాసాగర్ గారి అంత్యక్రియలు స్వయంగా మీనన్ దగ్గరుండి చేసింది..ఆయన చితి కి కూడా మీనా గారే నిప్పు అంటించారు..సాధారణంగా స్త్రీలు ఇలాంటి పనులు చెయ్యకూడదు అని శాస్త్రాల్లో చెప్తుంటారు..కానీ ఈ దంపతులిద్దరికీ కొడుకు లేడు..కావున కొడుకు లేకపోతే ఇష్టమైన వాళ్ళు తలకొరివి పెడుతారు..అందుకే మీనా చేతుల మీదుగా అంత్యక్రియలు జరిగిందని కోలీవుడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ.

తన భర్త చితాభస్మం తీసుకొని ఇంటికి రాగానే పోలీసులు మీనా ఇంటికి చేరారు..ఈ సమయం లో పోలీసులు ఏంటబ్బా అక్కడకి వచ్చిన బంధుమిత్రులు అందరూ అనుకున్నారు..ఇంతకీ పోలీసులు ఎందుకు వచ్చారంటే, సోషల్ మీడియా లో గత కొద్ది రోజుల నుండి విద్యాసాగర్ గారి మృతికి గల కారణాల గురించి రకరకాల చర్చలు సాగుతున్నాయి..ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది..కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత విద్యాసాగర్ గారి ఊపిరి తిత్తులు బాగా ఇన్ఫెక్షన్ కి గురైంది..అదే సమయమున మీనా గారి ఇంటి చుట్టూ పక్కన మొత్తం పావురాల తో నిండిపోయి ఉంటుంది.

వీటి వల్ల ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశం ఉంటుందని డాక్టర్లు ఇది వరకే చాలా సందర్భాలలో చెప్పారు..ఈ పావురాల వల్లే విద్య సాగర్ గారికి ఇన్ఫెక్షన్ ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగి ఆయన మరణం కి దారి తీసేలా చేసింది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరిగాయి..అయితే ఈ విషయం గురించే విచారించడానికి మీనా వద్ద కి వచ్చారు పోలీసులు..విచారించిన తర్వాత ఇక్కడ పావురాలను నియంత్రించేందుకు తగిన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని హామీ ఇచ్చారట పోలీసులు..ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *