లైగర్ పబ్లిక్ టాక్ ఒక్కసారిగా మారిపోయిందిగా..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది

Movie News Trending

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి సినిమా తర్వాత విజయ్‌ తనకంటూ ఫాలోయింగ్ సృష్టించుకున్నాడు. గీత గోవిందం వంటి సినిమాతో ఆ ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ నటించిన లైగర్ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. దీంతో బెనిఫిట్ షోలను కూడా ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. త‌న‌దైన విల‌క్ష‌ణ వ్య‌కిత్వం, ఆటిట్యూడ్‌తో విజయ్ దేవ‌ర‌కొండ యువ‌త‌రంలో స‌ంపాదించుకున్న క్రేజ్ ఏమిటో ప్ర‌చార కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా తెలిసొచ్చింది. లైగర్ ట్రైల‌ర్ సోష‌ల్‌ మీడియాలో సంచ‌ల‌నం సృష్టించింది. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్య కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. దీనికోసం విజ‌య్ దేవ‌ర‌కొండ విదేశాల్లో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకొని స‌రికొత్త మేకోవ‌ర్‌తో సిద్ధ‌మ‌య్యాడు.

అయితే విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తొలిరోజు తొలిఆట చూసిన చాలా మంది పెదవి విరిచారు. దీంతో డిజాస్టర్ అనే టాక్ జనాల్లోకి వెళ్లిపోవడంతో మ్యాట్నీ కలెక్షన్‌లపై ప్రభావం పడింది. కానీ సాయంత్రానికి టాక్‌తో తేడా వచ్చినట్లు కనిపిస్తోంది. టాక్ కొంచెం మెరుగుపడటంతో నైట్ షోలకు బుకింగ్స్ బాగున్నాయని ట్రేడ్ విశ్లేషకులు వివరిస్తున్నారు. అనన్య పాండే, రమ్యకృష్ణ, మైక్ టైసన్, చుంకీ పాండే కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ పూరీ స్టైల్‌లో తెరకెక్కింది. అయితే సెకండాఫ్ కొంచెం రొటీన్‌గా ఉందనే టాక్ ఈ సినిమాకు మైనస్ పాయింట్‌గా మారింది. అటు క్లైమాక్స్ కూడా బాగోలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హీరో పాత్ర‌కు న‌త్తిని స‌మ‌స్య‌గా చూపించ‌డంతో ఆ పాత్ర‌పై సింప‌థీ క్రియేట్ చేయ‌లేక‌పోగా హ‌ద్దులు విధించిన‌ట్లుగా అనిపించిందని పలువురు విమర్శిస్తున్నారు. అయితే విజయ్ నటన, నిర్మాణ విలువలు సినిమాను కొంతవరకు కాపాడుతున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.

సినిమా టాక్ ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు లైగర్ మూవీ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్‌లతోనే విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో ఒకసారి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. దాదాపు ఫస్ట్ డే మాస్ ఏరియాల్లో మొత్తం థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దర్శనమిస్తోంది. దీంతో తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల షేర్‌ను లైగర్ సొంతం చేసుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా 62 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 88 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే డివైడ్ టాక్ రావడంతో తొలి వీకెండ్‌లో లైగర్ మూవీ ఎంత రాబడుతుందన్న అంశం ఆసక్తి రేపుతోంది. నైజాం హక్కులను వరంగల్ శ్రీను దక్కించుకోగా ఉత్తరాంధ్ర హక్కులను దిల్ రాజు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా హక్కులను చదలవాడ శ్రీనివాసరావు దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *