లైగర్ ఫ్లాప్ అవ్వడం తో కంటతడి పెట్టిన విజయ్ దేవరకొండ

Movie News Trending

అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ, కథనాలు సాధారణంగా ఉన్నాయని అభిమానులు పెదవి విరుస్తున్నారు. విజయ్‌ దేవరకొండ, రమ్యకృష్ణ నటన తప్పిస్తే సినిమాలో ఏం లేదని తేల్చిపడేస్తున్నారు. విజయ్‌ అతిగా నత్తిగా మాట్లాడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కథ, కథనాలు లేకపోవడం, అనన్య పాండే నటన వెరసి సినిమాను డిజాస్టర్‌ చేశాయని క్రిటిక్స్ కూడా స్పష్టం చేస్తున్నారు. రామ్‌తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన మూవీ ఇదే. మూడేళ్లుగా ఈ సినిమా కోసం అటు పూరీ, ఇటు విజయ్ కష్టపడ్డారు. కానీ వీళ్లిద్దరి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.

అయితే లైగర్ పట్ల విజయ్ నిరుత్సాహపడినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూరీతో తీయాల్సిన జనగణమణ సినిమా ఉంటుందా.. ఆగిపోతుందా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. లైగర్ సినిమా పూర్తి కావడంతో ఇటీవల జనగణమణ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమయంలో లైగర్ సినిమా విడుదలై నిరాశ పర్చింది. దీంతో జనగణమణ సినిమా పరిస్థితి ఏంటో అంటూ జనాల్లో చర్చ మొదలైంది. ఫ్లాప్ కాంబినేషన్ అంటే జనాల్లో ఆసక్తి పోతుంది. బిజినెస్ కూడా తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజుల్లో సినిమా సక్సెస్ అయితే ఒకలా.. ఫ్లాప్ అయితే మరోలా ఆదరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క హిట్‌తో అందలం ఎక్కిస్తే.. ఒక్క ఫ్లాప్‌తో పాతాళానికి దిగజారే అవకాశాలున్నాయి. దీంతో జనగణమణ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. మరి పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అటు లైగర్ సినిమా తొలిరోజు రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లు.. రూ.15 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్‌లు రాబట్టిన విజయ్ సినిమాకు రెండో రోజే తుస్సుమనిపించేలా వసూళ్లు పడిపోయాయి. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కించారు. అటు లైగన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ నెలరోజుల్లోపే ఓటీటీలో విడులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైగర్ సినిమా థియేటర్లలో విడుదల కంటే ముందే ఓటీటీతో మంచి డీల్ కుదుర్చుకుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కు విక్రయించారు. ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం నిర్మాతలు భారీ మొత్తాన్ని అందుకున్నారు. అక్టోబర్ తొలివారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. మిశ్రమ స్పందన రావడంతో విడుదల నెలరోజుల కంటే ముందే వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 85 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. మరోవైపు లైగర్ తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మాటీవీ దక్కించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *