లైగర్ మూవీ పబ్లిక్ టాక్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

Movie News Trending

విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా అన్ని ప్రాంతీయ బాషలలో విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకి ముందు విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఎన్నో వ్యాఖ్యలు చేసాడు..’నా అయ్యా బాబులు ఇండస్ట్రీ లో లేరు..వరుసగా ఫ్లాప్స్ వచ్చినా కూడా నన్ను ఇంతలా ఆరాధిస్తున్నారు’ అంటూ ఇండస్ట్రీ లో లేజసి ని మోస్తున్న కొంతమంది స్టార్ హీరో అభిమానులకు కాలేటట్టు చాలా కామెంట్స్ చేసాడు..అలా వరుసగా కాంట్రవర్సీలు చేస్తూ ఈ సినిమాకి హైప్ పెంచే ప్రయత్నం చేసాడు.,అనుకున్నట్టే హైప్ ని పెంచడం లో సక్సెస్ అయ్యాడు..అసలు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు..అసలు ఏంటి ఇతని సంగతి..ఒకసారి సినిమా చూద్దాం అనే ఆత్రుతని ప్రతి ఒక్కరిలో కలిగించాడు..దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ హీరో లెవెల్ లో జరిగాయి..ఓపెనింగ్స్ అదిరిపొయ్యే రేంజ్ లో వచ్చాయి..కానీ టాక్ మాత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది..థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి పిచ్చి పట్టేలా చేసింది.

తీసిన ఈమాత్రం సినిమాకి ఇంత అతి చెయ్యాలా అంటూ థియేటర్స్ నుండి బయటకి వస్తున్నా ప్రేక్షకులు అనుకునేలా చేసింది ఈ చిత్రం..అసలు సాంగ్స్ ఎందుకు వస్తాయో..సెంటిమెంట్ సన్నివేశం తర్వాత వెంటనే సాంగ్ ఏంటో అసలు అర్థం కావడం లేదు..రేపు మళ్ళీ ‘జన గణ మన’ అనే సినిమా తీస్తున్నారు..ఈ సినిమాలో కూడా జెండా ఎగరేసిన తర్వాత ఐటెం సాంగ్ పెడుతారా?..అసలు పూరి జగన్నాథ్ ఇంత సెన్స్ లెస్ గా ఎలా మారిపోయాడు..ఇడియట్, బద్రి, పోకిరి లాంటి సినిమాలు అసలు ఈయనే తీసాడా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతుంది అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు..అంతే కాకుండా విజయ్ దేవరకొండ ని కూడా గట్టిగానే తిడుతున్నారు..రామ్ చరణ్ , ఎన్టీఆర్ వంటి హీరోలే దయచేసి థియేటర్స్ కి వచ్చి మా సినిమాని ఆశీర్వదించండి అని అడుగుతారు..కానీ చూస్తే చూడండి లేకపోతే పోండి అంటున్నావ్..అంత పొగరు ఎందుకు నీకు..మంచి సినిమా తీసి నువ్ అంత ఓవర్ కాంఫిడెన్స్ తో ఉన్నావు అంటే పర్లేదు అనుకోవచ్చు..ఇలాంటి చిల్లర సినిమాలు తీస్తే మళ్ళీ ఇంత పొగరు చూపించడం సరికాదు అంటూ పబ్లిక్ టాక్ లో ఆడియన్స్ మండిపడుతున్నారు.

వాస్తవానికి విజయ్ దేవరకొండ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది..అందం ఉంది ..టాలెంట్ ఉంది..ఇలా అన్ని ఉన్నాయి..కానీ యాటిట్యూడ్ కి పోకుండా మంచి సినిమాలు చేస్తూ ముందుకు పోతే అతి త్వరలోనే ఆయన మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్ స్టేటస్ ని సంపాదిస్తాడు..ప్రస్తుతం ఆయన మళ్ళీ పూరి జగన్నాథ్ తోనే ‘జన గణ మన’ అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమా మాములుగా మహేష్ బాబు తో చెయ్యాల్సింది..కానీ ఎందుకో కుదర్లేదు..ఈ సినిమా తర్వాత ఆయన శివ నిర్వాణ అనే దర్శకుడితో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు..ఇందులో సమంత హీరోయిన్..వీటితో పాటు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఇలా చేతినిండా క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి..మరి విజయ్ దేవరకొండ వీటిల్లో ఎదో ఒక సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్ కొట్టి స్టార్ లీగ్ లోకి వస్తాడా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *