లైగర్ మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం..డిజాస్టర్ టాక్ తో కూడా దుమ్ము లేపాడు

Movie News Trending

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ హైప్ లేపిన సినిమాలలో ఒకటి లైగర్..విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై విడుదలకు ముందు నుండే హైప్ భారీ గా ఏర్పడింది..దానికి తోడు విజయ్ దేవరకొండ కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా ఈ సినిమా ని తరుచు వార్తల్లో ఉండేలా చేసింది..అంతటి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది..అభిమానుల అంచనాలను ఈ సినిమా కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది..విజయ్ దేవరకొండ తనకి ఉన్న విలువైన మూడు సంవత్సరాల ప్రైమ్ పీరియడ్ ని ఈ సినిమాకి కేటాయించాడు..కానీ పూరి జగన్నాథ్ లెక్కలేని తనం తో ఈ సినిమాని తీసి జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్న తమ హీరో కెరీర్ కి స్పీడ్ బ్రేకర్ వేసాడంటూ విజయ్ దేవరకొండ అభిమానులు ఆందోళన చెందుతున్నారు..కానీ టాక్ బాగాలేకపోయినప్పటికీ ఈ సినిమా కి మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో అదిరిపొయ్యే ఓపెనింగ్ వచ్చింది.

ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూలు వచ్చాయి అనేది చూస్తే..మొదటి రోజు ఈ సినిమాకి నైజాం ఏరియా లో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిలు వచ్చాయి..ఇది మీడియం రేంజ్ హీరోల సినిమాలలో ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..ఒకవేల మంచి టాక్ వచ్చి ఉంటె ఈ సినిమా కి ఈ ప్రాంతం లో మొదటి రోజు 6 నుండి 7 కోట్ల రూపాయిల వరుకు షేర్ వచ్చి ఉండేది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..మార్నింగ్ షోస్ అద్భుతంగా ఉన్నప్పటికీ టాక్ లేకపోవడం తో మాట్నీస్ నుండి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి..అందుకే ఆశించిన స్థాయి ఓపెనింగ్ ఇక్కడ రాలేదు..ఇక ఈ సినిమా లో సీడెడ్ లో ఒక కోటి 30 లక్షల రూపాయిలు వసూలు చెయ్యగా, వైజాగ్ లో కోటి 30 లక్షలు , ఈస్ట్ గోదావరి జిల్లాలో 64 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 39 లక్షలు, కృష్ణ జిల్లాలో 48 లక్షలు, గుంటూరు జిల్లాలో 84 లక్షలు నెల్లూరు జిల్లాలో 40 లక్షల రూపాయిలు షేర్స్ ని వసూలు చేసి మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దుమ్ము లేపేసింది అనే చెప్పాలి..కేవలం ప్రీమియర్స్ నుండే ఈ సినిమా నాలుగు లక్షల 50 వేల డాలర్లు వసూళ్లు చేసింది..ఇక ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కి కలిపి దాదాపుగా 5 లక్షల 50 వేల డాలర్లు వసూలు చేసింది..అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు USA నుండి ఒక కోటి 70 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది..ఇక కర్ణాటక లో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లే వచ్చాయి..అక్కడ ఈ సినిమాకి మొదటి రోజు రెండు కోట్ల రూపాయిలు వచ్చినట్టు సమాచారం..ఇక ఈరోజు నుండి హిందీ వెర్షన్ లో కూడా ఈ సినిమా విడుదల అయ్యింది..అక్కడ ఈ చిత్రం అంతంత మాత్రమే వసూళ్లను రాబట్టింది..ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 90 కోట్ల రూపాయిల వరుకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది..ఇప్పుడు అంత మొత్తం వసూళ్లు రాబట్టడం అసాధ్యం అనే అనిపిస్తుంది రెండవ రోజు వసూళ్లు చూస్తుంటే..బయ్యర్స్ కి ఈ సినిమా 50 శాతం కి పైగా నష్టాలను మిగిలించే అవకాశాలు కూడా ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *