విడుదలకి ముందే 30 కోట్లు భారీ నష్టం..పాపం కళ్యాణ్ రామ్

Movie News

నందమూరి మూడోతరం నటుల్లో పేరు తెచ్చుకున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన తొలి చూపులోనే సినిమాతో కళ్యాణ్‌రామ్ టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. తన సోదరుడు ఎన్టీఆర్ కూడా రామోజీరావు బ్యానర్ నుంచే హీరోగా పరిచయం అయ్యాడు. అయితే ఎన్టీఆర్ కెరీర్‌లా కళ్యాణ్‌రామ్ కెరీర్ సాగలేదని స్పష్టంగా చెప్పవచ్చు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు. అతడిలో తాత పోలికలు ఉండటంతో ప్రజలు అతడిని అభిమానించారు. కానీ కళ్యాణ్‌రామ్‌ నటనలో వైవిధ్యం కనిపించకపోవడంతో అతడి కెరీర్‌లో సక్సెస్‌లు ఎక్కువగా లేవు. అతనొక్కడే, పటాస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు తప్ప మిగతా సినిమాలన్నీ యావరేజ్ లేదా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నవే ఉన్నాయి. తాజాగా కళ్యాణ్‌రామ్ బింబిసార అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై కళ్యాణ్‌రామ్ గంపెడాశలు పెట్టుకున్నాడు.

అయితే విడుదలకు ముందే బింబిసార సినిమా నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌కు భారీ నష్టాలను తెచ్చిపెట్టిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రూ.45 కోట్ల బడ్జెట్‌తో బింబిసారను నిర్మించగా కేవలం రూ.15కోట్లు మాత్రమే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో కళ్యాణ్‌రామ్ రూ.30 కోట్లు నష్టపోయాడంటూ పలువురు చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై ఈ సినిమాను కళ్యాణ్‌రామ్ నిర్మించాడు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. ఇప్ప‌టికే బింబిసార సినిమా నుండి విడుద‌లైన పోస్ట‌ర్లు నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ బిజినెస్ చేయడంలో మాత్రం ఈ సినిమా విఫలమైనట్లు పలువురు మాట్లాడుకుంటున్నారు.

కళ్యాణ్ రామ్ తన కెరీర్ ప్రారంభం నుంచీ కమర్షియల్ కథలకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న చిత్రాలనే ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో బింబిసారతో పాన్ ఇండియా లెవెల్‌లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంతో ముందుకొస్తున్నాడు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ మొదటిసారి తన కెరీర్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో విడుదలైన బింబిసార టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ఆల్‌వేస్ ఎ విచ్ అనే స్పానిష్ వెబ్ సిరీస్ నుంచి ప్రేరణ పొందిందని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. 1646 కొలంబియాలో ఓ అమ్మాయిని చేతబడి తరహా బ్లాక్ మ్యాజిక్ చేస్తోందని మంటల్లోకి తోసి తగలెట్టేస్తారని… ఆమె మళ్లీ టైమ్ ట్రావెల్ చేసి ఇప్పటికాలానికి వస్తుందని.. ఆమె పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని.. దాదాపు అలాంటి కథే బింబిసార అని మాట్లాడుకుంటున్నారు. 500వ శతాబ్దంలో మగధ దేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసార జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *