స్టార్ కమెడియన్ మృతి..శోక సంద్రం లో టాలీవుడ్

Movie News Trending

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా కరోనాతో ఎందరో టాలీవుడ్ లెజెండ్లు తుదిశ్వాస విడిచారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు సహా డ్యాన్స్ మాస్టర్ శివశంకర్‌తో పాటు పలు విభాగాలకు చెందిన టెక్నీషియన్లు అలాగే నిర్మాతలు, నటులు కన్నుమూశారు. అంతేకాకుండా ఇటీవల చూసుకుంటే అలనాటి హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్, రాధికా శరత్ కుమార్ మాజీ భర్త, అర్జున్ తల్లి, నోయల్ తండ్రి ఇలా చాలామంది మరణించారు. తాజాగా సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్‌ దీపేష్‌ భాన్ కన్నుమూశారు. ఆయన వయసు 41 ఏళ్లు. గతవారం ఓ రోజు ఉదయం క్రికెట్‌ ఆడుతూ కిందపడంతో దీపేష్ భాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపేష్‌ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

దీపేష్ భాన్ మరణవార్తను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కవిత కౌశిక్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. దీపేష్‌ హఠ్మారణంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీపేష్‌ చాలా ఫిట్‌గా ఉంటారని, మద్యపానం, పొగతాగే అలవాట్లు కూడా లేవంటూ ఆమె భావోద్వేగానికి లోనియ్యారు. దీపేష్‌ భాన్ బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కమెడియన్. అతడు 41 ఏళ్లకే చిన్న వయసులోనే ఇలా అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన తోటి నటులు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షోగా ‘భాభి జీ ఘర్ పర్ హై’ ని చెప్పుకోవచ్చు. ఈ షోతో పాపులర్ అయిన వారిలో దీపేష్ భాన్ కూడా ఒకరు. ‘భాభి జీ ఘర్ పర్ హై’ అనే బుల్లితెర షోలో మల్ఖాన్ సింగ్ పాత్రతో దీపేష్ భాన్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

దీపేష్ భాన్ గురించి ఇప్పటి తరానికి సరిగ్గా తెలియకపోవచ్చు. దీపేష్ భాన్ 2019లో వివాహం చేసుకున్నారు. దీపేష్ దంపతులకు పద్దెనిమిది నెలల కుమారుడు కూడా ఉన్నాడు. దీపేష్ భాన్ బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడ్డాడని అతని సహనటుడు ఆసిఫ్ షేక్ వెల్లడించారు. దీపేష్ భాన్ శుక్రవారం ఉదయం ఏడు గంటలకు జిమ్‌కి వెళ్లి తన భవనం కాంపౌండ్‌లో క్రికెట్ ఆడటానికి ఆగిపోయాడు. అతను ఒక ఓవర్ బౌల్ చేశాడు, బంతిని అందుకోవడానికి దిగి, లేచి, కాసేపు ఊగిపోయి కిందపడ్డాడు. కిందపడిపోయి ఎంతసేపటికీ లేవలేదని ఆసిఫ్ షేక్ మీడియాతో పంచుకున్నారు. భాన్‌ను తరలించిన ఆసుపత్రి అతడి నివాసం నుంచి ఐదు నిమిషాల దూరంలో ఉంది. కానీ ఆస్పత్రికి తరలించేలోపే దీపేష్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారని ఆసిఫ్ షేక్ తెలిపారు. కాగా దీపేష్‌ మృతికి పలువురు సినీ, టీవీ నటీనటులు సంతాపం ప్రకటించారు. ‘భాబీ జీ ఘర్‌ పర్‌ హై’ అనే సీరియల్‌తో పాటు ‘కామెడీ కా కింగ్‌ ఖాన్‌’, ‘కామెడీ క్లబ్‌’, ‘భూత్‌వాలా’, ‘ఎఫ్‌ఐఆర్‌’, ‘ఛాంప్‌’ వంటి షోలతో దీపేష్ భాన్ మంచి గుర్తింపు పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *