స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య

Movie News Trending

గత ఏడాది కాలం నుండి సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా కి మంచి నెస్ టాపిక్ సమంత మరియు నాగ చైతన్య విడాకుల వ్యవహారం..ఏమాయ చేసావే అనే సినిమా ద్వారా పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకునే స్థితికి వచ్చింది..2017 వ సంవత్సరం లో అతిరథ మహారాదుల సమక్షం లో వీళ్లిద్దరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది..చూడడానికి ఎంతో ముచ్చటగా ఉండే ఈ జంట కి అభిమానుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..అందుకే వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్తని ఇప్పటికి ఎవ్వరు నమ్మలేకున్నారు..అయితే ఈ జంట మాత్రం మేము విడిపోయాము అనే విషయాన్నే పూర్తిగా మర్చిపొయ్యి ఎవరి కెరీర్ లో వారు బిజీ గా గడుపుతున్నారు..నాగ చైతన్య కి అయితే విడాకులు తర్వాత లవ్ స్టోరీ , బంగార్రాజు వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి..సమంత కూడా వరుసగా పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.

అయితే గత కొంతకాలం నుండి నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో ఆయన ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని..ఈ ఏడాది చివర్లో వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి..అయితే ఈ వార్తలపై అటు నాగ చైతన్య కానీ ఇటు శోభిత దూళిపాళ్ల కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..అయితే ఇటీవల కాలం లో నాగ చైతన్య ఇంటి ముందు శోభిత దూళిపాళ్ల కార్ ఉండడంని కొంతమంది నెటిజెన్ల ఫోటో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు..అది కూడా పగలు కాదు..అర్థరాత్రి 12 గంటలకు ఆ కార్ ని నాగ చైతన్య ఇంటి ముందు ఉండడం చూశారట..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్లిద్దరు డేటింగ్ లోనే ఉన్నారనే విషయాన్ని..ఇటీవల తన సినిమాల ప్రొమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఇచ్చిన ఇంటర్వూస్ లో కూడా ఈ వార్తలను ఆయన ముందుకు తీసుకొని రాగ కేవలం ఒక నవ్వు నవ్వి ఆగిపోయారు..దీనిని బట్టి అర్థం ఏమిటి?? సోషల్ మీడియా లో వస్తున్నా ఆ రూమర్స్ నిజమనే కదా అంటున్నారు నెటిజెన్లు.

మరి ఈ వార్తల్లో ఎంత వరుకు నిజం ఉందొ అతి త్వరలోనే తెలిసిపోనుంది..ఇక నాగ చైతన్య సినిమాల కెరీర్ విషయానికి వస్తే ఇటీవల కాలం లో ఆయనకీ వరుసగా హిట్స్ , బ్లాక్ బస్టర్ హిట్స్ తగిలాయి..మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ మరియు బంగార్రాజు వంటి వారు బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నాగ చైతన్య స్పీడ్ కి ఇటీవలే విడుదలైన థాంక్యూ సినిమా పెద్ద స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది..మొదటి రోజు మొదటి ఆట నుండే యావరేజి టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కి ఓపెనింగ్స్ దగ్గర నుండే దారుణమైన దెబ్బ పడింది..ఫుల్ రన్ లో ఈ చిత్రం కనీసం 5 క్తోల రూపాయిల షేర్ కూడా వసూలు చెయ్యకపోవడం నిజంగా దురదృష్టకరం..ప్రస్తుతం అక్కినేని అభిమానులంతా నాగ చైతన్య తదుపరి చిత్రం పైనే భారీ నమ్మకాలు పెట్టుకున్నారు..ఎందుకంటే ఆయన చెయ్యబొయ్యే తదుపరి చిత్రం గీత గోవిందం మరియు సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తీసిన పరశురామ్ పెట్ల తో..ఎంటర్టైన్మెంట్ తో సినిమాలు తియ్యడం లో దిట్ట అయినా పరశురామ్ గారు అక్కినేని అభిమానులకు చిరస్థాయిగా గుర్తుండిపోయ్యే సినిమా ఇస్తాడని ఆశిస్తున్నారు..మరి వారి నమ్మకాలను ఈ కాంబినేషన్ నిలబెడుతుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *