హీరోయిన్ మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే మెంటలెక్కిపోతారు

Movie News Trending

టాలీవుడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరా జాస్మిన్‌ను చూస్తే అచ్చ తెలుగమ్మాయిని చూసినట్లే ఉంటుంది. 2001లో వచ్చిన మలయాళ సినిమా సూత్రధారన్‌తో మీరా జాస్మిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2004లో వచ్చిన మలయాళ సినిమా పదం ఒన్ను ఒరు విలాపం సినిమాలో మీరా జాస్మిన్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. మలయాళంలోనే కాదు తమిళ, తెలుగు భాషల్లోనూ మీరా జాస్మిన్ నటించింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో ఈ హీరోయిన్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. ముఖ్యంగా గుడుంబా శంకర్ సినిమాలో చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్ర హింసలే పడుతున్నా అంటూ మీరా జాస్మిన్‌ను చూసి పవన్ కళ్యాణ్ పాడే పాట అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. రవితేజ సరసన నటించిన భద్ర సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణతో చేసిన మహారథి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

హీరో విశాల్ సరసన నటించిన పందెం కోడి సినిమాలో అల్లరిపిల్లగా మీరా జాస్మిన్ అందర్నీ ఆకట్టుకుంది. అప్పట్లో మీరాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. యూత్ ఎక్కువగా మీరాను ఇష్టపడేవాళ్లు. గోరింటాకు సినిమాలో రాజశేఖర్ చెల్లెలిగా నటించిన మీరా జాస్మిన్ ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు. తెలుగు కంటే తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫోకస్ చేసింది మీరా జాస్మిన్. అయితే ఆమె కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో జీవితంలో వివాహం చేసుకుని సెటిలైపోయింది. దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో మీరా జాస్మిన్‌కు తిరువనంతపురంలోని పాలయంకోట్టైలో గల ఎల్‌ఎంస్ చర్చిలో 2014 ఫిబ్రవరి 12 బుధవారం వివాహం జరిగింది. మీరాజాస్మిన్ అనిల్ జాన్ టైటస్ ఫిబ్రవరి 10, 2014, సోమవారం రాత్రి 8.30 గంటలకు చట్టబద్ధంగా భార్యాభర్తలయ్యారు.అయిత పెళ్లి తర్వాత మీరా కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

కాగా చీరకట్టు, హోమ్లీ లుక్‌లో కనిపించే మీరా జాస్మిన్‌ను చూడగానే అచ్చ తెలుగమ్మాయి అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి మీరా ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది. అయితే చాలా కాలం తర్వాత ఇటీవలే ‘మకల్’ అనే మలయాళీ సినిమాతో మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కొద్ది నెలల క్రితమే ఇన్‌స్టాలో ఖాతా కూడా తెరిచిన మీరా జాస్మిన్ ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు షేర్ చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమైన మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తోంది. దర్శక నిర్మాతలకు ఇంకా హీరోయిన్ పాత్రలకు తాను రెడీగా ఉన్నానంటూ చెబుతోంది. తాజాగా ఓ రెస్టారెంట్‌లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గతంలో హోమ్లీగా కనిపించిన మీరా జాస్మిన్ ఈ ఫోటోల్లో కాస్త హాట్‌గా కనిపిస్తోంది. ఒకవేళ మీరాజాస్మిన్‌కు దర్శకులు అవకాశం ఇస్తే ఎలాంటి పాత్రల్లో తీసుకుంటారో అర్ధం కావడం లేదు. అక్క, అమ్మ పాత్రల్లోనే ప్రస్తుతం ఆమె సూటవుతుంది. అయితే ఒకప్పుడు బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కాస్త సన్నబడి నిత్యం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ అమ్మడు చేస్తున్న అందాల ఆరబోతకు అబ్బాయిల మతిపోతుందంటే అతిశయోక్తి కాదు.

1

2

3

4

5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *