Honey Roje.. హనీ రోజ్.. గతంలో ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ ఎప్పుడైతే నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna)సరసన నటించిందో.. అప్పటి నుంచీ ఈమె పేరు బాగా మారుమ్రోగుతోంది. ముఖ్యంగా బాలయ్య హీరోయిన్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈమెకు అభిమానులుగా మారిపోతున్నారు. తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. మలయాళ ఇండస్ట్రీకి చెందిన హనీ రోజ్ తెలుగులో కూడా బాలయ్యతో సినిమా చేయకముందే కొన్ని సినిమాలలో హీరోయిన్గా చేసిందట. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..
హనీ రోజ్ దాదాపు 14 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయిన్ గా నటించింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన ఆ తెలుగు సినిమా గురించి వెతుకులాట మొదలుపెట్టారు అభిమానులు. ఆమె నటించింది మరెవరితో కాదు హీరో శివాజీ తో.. హీరో శివాజీ హీరోగా నటించిన సినిమాలో ఆమె హీరోయిన్గా చేసింది 2008లో శివాజీ సరసన ఆలయం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది హనీ రోజ్. ఈ సినిమాని ట్రెండ్ సెట్ ఫిలిమ్స్ వారి నిర్మించారు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించగా ఈ మూవీ అప్పట్లోనే రూ.రెండున్నర కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది.
ఈ సినిమా ద్వారా అన్ని రోజులకు ఊహించినంత సక్సెస్ లభించలేదు. దాంతో ఆమె గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాలకు కాస్త దూరమైందని చెప్పాలి. అయినా వీరసింహారెడ్డి వరకు ఆమెకు తెలుగులో సరైన అవకాశం కూడా దక్కలేదు. తన 14వ ఏట నుంచి యాక్టింగ్ మొదలుపెట్టిన ఈమె 2005లోనే తన యాక్టింగ్ కెరియర్ ను ప్రారంభించింది తర్వాత 2008లో ఆలయం సినిమాలో నటించి 2014లో ఈ వర్షం సాక్షిగా సినిమా కూడా చేసింది.
ఇప్పుడు దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో మళ్లీ తెలుగులో నటించిన ఈమె ఇప్పుడు మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది . కన్నడ , మలయాళం భాషల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది.