Jamuna: సీనియర్ నటి జమున ఇకలేరు..!

0
22

Jamuna: తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకరి మరణం జీర్ణించుకోకముందే మరొకరి మరణం అందరిని కలవరపెడుతోంది . దిగ్గజ నటులు ఒకరి తరువాత ఒకరు స్వర్గస్తులవుతూ ఉండడం నిజంగా ఇండస్ట్రీకి తీరని విషాదం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటీనటులు ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులవుతూ.. సినీ ఇండస్ట్రీని ఒంటరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది కృష్ణంరాజు తర్వాత కృష్ణ మరణించి మొదటి శకానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి నటులు కూడా మరణించడం తో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు.

తాజాగా సీనియర్ నటి.. అలనాటి అందాల తార జమున కూడా మరణించారు. ఈరోజు ఉదయం హైదరాబాదులోని తన స్వగృహంలో ఆమె కన్ను మూసినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు కాగా వయోధికభారం తోపాటు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా జమున (Jamuna) కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఇకపోతే జమున మరణం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఆమె ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈలోపే ఆమె మరణించడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.

1953 పుట్టిల్లు అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన జమున.. మిస్సమ్మ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. సత్యభామ వంటి క్యారెక్టర్ కు సరిగ్గా సూట్ అయ్యే జమున ఏదైనా పాత్ర చేసింది అంటే కచ్చితంగా ఆ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేస్తుందని చెప్పవచ్చు. అల్లరిగా ప్రేక్షకులను అలరించడమే కాదు సౌమ్యంగా కుటుంబ బాధ్యతలను నెరవేర్చే గృహిణిగా కూడా ఆకట్టుకుంది అందుకే ఈమెకు ఫ్యామిలీ అభిమానులు ఎక్కువగా ఉన్నారు

అలనాటి దివంగత నటి సావిత్రితో సమానంగా పోటీపడి మరి సినిమాలను చేసిన జమున ఆమెతో ఏ రోజు విభేదాలకు పోలేదు. సావిత్రిని తన సొంత అక్కయ్యగా భావించేది జమున. అలా వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి ప్రభంజనం సృష్టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here