renu-desai

Renu Desai: నా 10 నిమిషాల సుఖం కోసం ఒక జీవితాన్నే నాశనం చేయలేను…

Movie News Trending

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రెండవ భార్య రేణు డేసాయ్ గురించి అందరికి తెలిసిందే ఆవిడ సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది, రేణూ దేశాయ్ త‌న ఫ్యామిలీ విష‌యాల‌తో పాటు స‌మాజానికి సంబందిత విష‌యాల‌ను షేర్ చేస్తూ ఉంటుంది.ఆ మ‌ధ్య త‌న కుమారుడు క‌ర్ర‌సాము చేసిన వీడియోను షేర్ చేసి నెటిజ‌న్స్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ను ఆనందింప‌జేసింది.

అలాగే తాను ఎప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్యనని ఆయన ఫేమ్ వాడుకోకుండా తనకంటూ స్వతహాగా గుర్తింపును తెచ్చుకుంది. మరియు తను అప్పుడప్పుడు తన ఫోల్లవర్స్ మరియు నెటీజన్స్ వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.

renu-desai

ఇది సాధారణంగా జరిగే విషయం అని అందరికి తెలుసు, అలానే త‌న అందం మరియు అభిన‌యంకి సంబంధించి నెటిజ‌న్స్ వేసిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌రదాగా ఇలా స్పందించింది.

ఇటీవల రేణూ దేశాయ్ జంతు హింస‌కు సంబంధించి ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది . జంతు హింస అంటే న‌చ్చ‌ని చాలా మంది మాంసాహారం మానేసి శాఖాహారులుగా మారుతున్నారు. ఆ మధ్య ఆహా భోజనంబు షోలో ఆలీ గారు గెస్టుగా వచ్చారు. తన భార్య మటన్ తినడం మానేసిందని దాని వెనుకున్న అసలు కారణాన్ని ఇలా చెప్పుకొచ్చారు.

ఓ సారి ఆలీ గారి భార్య గారు మేకను కోసి ముక్కలు ముక్కలుగా కట్ చేయడం చూసిందట కాబట్టి అప్పటి నుంచి మటన్ తినడం పూర్తిగా మానేసింద‌ని ఆలీ గారు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు రేణూ దేశాయ్ గారు కూడా రియ‌లైజ్ అయిన‌ట్టు తెలుస్తుంది. జంతు పరిరక్షణకు సంబంధించిన ఓ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్‌ను రేణూ దేశాయ్ గారు తిరిగి షేర్ చేస్తూ తాను కూడా శాఖాహారిగా మారింద‌నే అభిప్రాయాన్ని చెప్ప‌క‌నే చెప్పింది.

తాను ఆ పోస్టులో పంచుకున్న విషయం ఇలా ఉంది, నేను శాఖాహారిగా ఎందుకు మారిపోయాను? తెలుసా… ఎందుకంటే.. ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని, దానికి భయం, దానికి బాధ, నొప్పి ఇవన్నీ కూడా కేవలం నా పది నిమిషాల సుఖం, సంతోషానికి సరితూగదు అని తెలుసుకున్నాను.

నా 10 నిమిషాల సుఖం కోసం ఒక జీవితాన్నే నాశనం చేయలేను… అని ఆ విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను. అంటూ ఆ పోస్ట్ సారాంశాన్ని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. ప‌ది నిమిషాల ఆనందం, సుఖం కోసం ఇలా చేస్తున్నాను అంటూ రేణూ చెప్ప‌డం విశేషం. ఈ విషయం నెటీజన్స్ నే కాదు తన ఫాలోవార్స్ ను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ పోస్ట్ చూసిన తరువాత నెటీజన్స్ లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. కొందరు దీనికి ఆనందంగా స్పందిస్తే ఇంకొందరు మాత్రం ఆశ్చర్యాన్ని వెక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *