అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి చిన్నారి…ఇప్పుడు ఏం చేస్తుందంటే…

0
16

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి.ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా సమంత నటించడం జరిగింది.ఇక కన్నడ హీరో అయినా ఉపేంద్ర ఈ చిత్రంలో విలన్ గా నటించారు.భారీ బడ్జెట్ తో తండ్రి సెంటిమెంట్ తో తెరకెక్కబడిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.అయినా కూడా ఈ సినిమాను ఇప్పటి టీవీ లో ప్రసారం అయితే చూసే అభిమానులు చాల మందే ఉన్నారు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు వెన్నెల కిషోర్ అన్నయ్య గా నటించారు.ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కూతురుగా నటించిన చిన్నారి తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

ఈ చిన్నారి పేరు వర్ణిక.ఈ సినిమాలో చాల క్యూట్ గా ఉండే వర్ణిక హై లైట్ అని చెప్పచ్చు.సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో హీరో అల్లు అర్జున్ మరియు తన అన్నయ్య కూతురు అయినా వర్ణిక మధ్య పలు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాలో ఒక సాంగ్ లో వర్ణిక ఎక్స్ప్రెషన్స్ కు ప్రేక్షకులు బాగా ఫిదా అయ్యారు అని చెప్పచ్చు.

అయితే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత వర్ణిక మరొక సినిమాలో కనిపించలేదు.వర్ణిక సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది.వర్ణిక ఖాతాతో సోషల్ మీడియాలో ఆమె తల్లితండ్రులు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వర్ణిక ఎంతలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here